ఇక సమరమే, టార్గెట్ రేవంత్ - కేసీఆర్ కీలక నిర్ణయం..!!

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారం భం కానున్నాయి. సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా తన ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించేందుకు నిర్ణయించారు. నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. తెలంగాణ తల్లి విగ్రహం పైన కేసీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ వేదికగా స్పందించాల్సిన అంశాల పై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసారు. ఇక, రేవంత్ పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని... ప్రభుత్వ వైఫల్యాల పై వరుస కార్యక్రమాలతో పాటుగా బహిరంగ సభకు నిర్ణయించారు.

తెలంగాణ తల్లి విగ్రహం పై
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాజీ సీఎం కేసీఆర్ కీలక దిశా నిర్దేశం చేసారు. సభలో చర్చకు వచ్చే అంశాల పైన ఏ విధంగా స్పందించాలో సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పును మూర్ఖపు చర్యగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు.. పరిస్థితులను అందరికీ వివరించాలని సూచించారు. నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలని నిర్దేశించారు. తెలంగాణ తల్లి భావన తనది మాత్రమే కాదని, యావత్‌ తెలంగాణ సమాజానిదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని చెపారు. ఇంకా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మౌనంగా ఉంటే ప్రజలు కూడా ఊరుకోరని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

KCR bitterly criticised changing of the Telangana Talli statue made key decision

ప్రభుత్వాన్ని నిలదీయండి
రేవంత్ ప్రభుత్వం నిరుపేదలను, రైతులను, గిరిజనులను, దళితులను నిర్దాక్షిణ్యంగా వేధిస్తు న్నదని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని కేసులతో వేధిస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గురుకుల విద్య రోజురోజుకూ దిగజారుతున్నదని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా తయారయ్యిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని నిలదీయాలని సూచించారు. ఇచ్చిన హామీలను నెరవే ర్చలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులను అణచివేస్తున్నదని కేసీఆర్ పేర్కొన్నారు.మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఇండ్లను కూలగొడుతున్నదని, ఇది ఎంతమాత్రమూ క్షమించరానిదని తెలిపారు.

భారీ బహిరంగ సభ
హైడ్రా అంశం పైనా కేసీఆర్ స్పందించారు. హైడ్రా ముసుగులో పేదల నివాసాలను బల్డోజ్లతో ప్రభుత్వం కూల్చివేత ధోరణి పైన సభలో నిలదీయాలని కేసీఆర్ నిర్దేశించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం పట్ల సభలో ప్రస్తావించాలని కేసీఆర్ సూచించారు. రైతుబంధు తమ ప్రభుత్వం అమలు చేసిన తీరును వివరించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఈ అంశం పై చర్చకు రానుండటంతో రైతు సమస్యలను ప్రస్తావించాలన్నారు. ఫిబ్రవరిలో పార్టీ పరంగా బహిరంగ సభ నిర్వహించి సర్కార్ వైఖరి ఎండగట్టే ఆలోచనలో ఉన్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ఆ తర్వాత పార్టీ అన్ని కమిటీలు ఏర్పాటు, సభ్యత్వ నమోదు చేయాలని భావిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+