దళితుడిని మోసం చేసిన కేసీఆర్.!దళిత బంధు,మూడెకరాల భూమి ఎక్కడ.?నిలదీసిన షర్మిళ.!
హైదరాబాద్ : బాబా సాహెబ్ అంబేద్కర్ స్పూర్తితో వైఎస్సార్ తెలంగాణ పార్టీ దళితుల హక్కుల కోసం, అభివృద్ధి కోసం పోరాడుతోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ స్పష్టం చేసారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా లోటస్ పాండ్ లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో షర్మిళ నివాళులర్పించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం కన్వీనర్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న ఆద్వర్యంలో డా.బి.ఆర్ అంబెద్కర్ 65వ వర్ధంతి నిర్వహించారు.

మాయమాటలతో కాలం గడుపుతున్న కేసీఆర్.. దళితులను దగా చేసారన్న వైఎస్సార్ సీపి
వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న మాట్లాడారు. దళితుల ఎజెండాగా అంబేద్కర్ సూచించిన నీలి రంగును వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండాలో ఇముడింపజేసి, సామాజిక న్యాయానికి వైయస్ షర్మిల పెద్దపీఠ వేశారన్నారు. మహిళలకు ప్రాధాన్యత, యువతరాన్ని ప్రోత్సహించే విధంగా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వెనుకబడిన వర్గాల జనాభా ప్రాతిపాధికన వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కట్టుబడి ఉన్నారని తెలిపారు.

అంబేద్కర్ ఆశయ సాధన కోసం పుట్టింది వైఎస్సార్ టీపి..తెలంగాణలో జెండా ఎగరేస్తామన్న వైసీపి నేతలు
అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం కట్టిస్తామని చెప్పి, పంజాగుట్టలో ఉన్న విగ్రహాన్ని కూడా చంద్రశేఖర్ రావు తొలగించారని విమర్శించారు. దళితబంధు, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చంద్రశేఖర్ రావు మోసం చేశారని అన్నారు. దళిత వర్గం నుంచి క్యాబినెట్ లో ఒక్క మంత్రి కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సమాజాన్ని అణచివేయడమే పనిగా కేసీఆర్ కంకణం కట్టుకున్నారని అన్నారు. భవిష్యత్తులో దళితులు చంద్రశేఖర్ రావు కు బుద్ధిచెబుతారని అన్నారు. అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకుని తెలంగాణలో ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

దళితులకు ఇచ్చిన హామీలన్నీ మరిచారు.. కేసీఆర్ పై మండిపడ్డ వైఎస్సార్ టీపి
వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి గారు మాట్లాడారు. పైదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ గారు తీసుకువచ్చిన రిజర్వేషన్లు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం పరితపించినటువంటి మహా నాయకుడు అంబేద్కర్ అని అన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. అంబేద్కర్ గారి ఎజెండా, వైఎస్సార్ గారి ఆశయాల సాధన కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందని పేర్కొన్నారు.

కేసీఆర్ కు బుద్ది చెప్పేరోజులు వస్తాయి.. దళితుల అభ్యున్నతికి వైఎస్సార్ టీపి కట్టుబడి ఉందన్న షర్మిళ
అంబేద్కర్ గారి కోసం 125 అండుగుల ఎత్తు విగ్రహం కడతామని చంద్రశేఖర్ రావు చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చంద్రశేఖర్ రావు మోసం చేశాడని తెలిపారు. మాయమాటలతో కాలం గడుపుతున్నచంద్రశేఖర్ రావుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. చంద్రశేఖర్ రావు లో మార్పు రాదని హుజూరాబాద్ ఎన్నికలతో తేలిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications