బాబుతో మాట్లాడండి: కేసీఆర్, 1న ఇరుష్ట్రాల ప్రతినిధులతో గవర్నర్ భేటీ
ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉండి, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే ఇప్పించేలా చంద్రబాబునాయుడిని ఒప్పించాలని గవర్నర్ నరసింహన్‌ను సీఎం కేసీఆర్ కోరినట్టు తెలిసింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉండి, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే ఇప్పించేలా చంద్రబాబునాయుడిని ఒప్పించాలని గవర్నర్ నరసింహన్‌ను సీఎం కేసీఆర్ కోరినట్టు తెలిసింది. సోమవారం ఉదయం మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా, బాపూ ఘాట్ లో ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం రాజ్ భవన్‌లో నరసింహన్‌ను కేసీఆర్ కలిసి చర్చించారు.
ఏపీ సచివాలయం అమరావతికి తరలి వెళ్లిందని గుర్తు చేసిన ఆయన.. ఆ భవనాలను స్వాధీనం చేసేలా గవర్నర్ కృషి చేయాలని కోరినట్టు తెలుస్తోంది. విభజన అనంతర సమస్యలు ఇంకా పీడిస్తున్నాయని ఆయన చెప్పారు.
కాగా, ఎల్లుండి తన సమక్షంలో తెలంగాణ, ఏపీ మంత్రుల భేటీ ఉందని గుర్తు చేసిన నరసింహన్.. ఆ సమావేశంలో భవనాల అప్పగింతపై మాట్లాడదామని చెప్పినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ లో తమకు ఓ శాశ్వత భవనాన్ని అప్పగిస్తే, సచివాలయం అప్పగింతపై నిర్ణయం తీసుకోవాలన్నది చంద్రబాబు అభిప్రాయం. అందుకోసం తెలంగాణ సర్కారుతో చర్చించేందుకు ఓ కమిటీని కూడా ఆయన నియమించిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 1న ఇరుష్ట్రాల ప్రతినిధులతో భేటీ
విభజన సమస్యలపై పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న ఈ సమావేశాన్ని నిర్వహించి చర్చించనున్నారు.
ప్రాజెక్టులపై విభేదాలు, భవనాలకు సంబంధించిన సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి మంత్రి హరీశ్ రావు తోపాటు మరికొందరు, ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిసింది. గవర్నర్ పదవీకాలం ముగియునన్న నేపథ్యంలో
శాఖలవారీగా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications