ఆధ్యాత్మికం, రాజకీయం :స్వరూపానందేంద్రస్వామితో కేసీఆర్ మంతనాలు (వీడియో)
హైదరాబాద్ : విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నారు సీఎం కేసీఆర్. కాసేపటి క్రితం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానంలో స్వామివారిని కలిశారు కేసీఆర్. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలో శనివారం స్వామివారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికం, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
కేసీఆర్‌కు ఆహ్వానం
జూన్ లో విశాఖ శారదపీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారం కార్యక్రమం ఉంది. బాధ్యతల స్వీకారాత్సోవానికి రావాలని కేసీఆర్ ను స్వామిజీ ఆహ్వానించారు. జూన్ 15 నుంచి మూడురోజుల పాు విజయవాడలో ఉత్తరాధికారి కార్యక్రమల నిర్వహణ జరగనున్న సంగతి తెలిసిందే.















Click it and Unblock the Notifications