మతపరమైన రిజర్వేషన్లు కాదు, మోడీ సహకరిస్తారనే.. లేదంటే: కేసీఆర్, ముందస్తు ఎన్నికలపై..

ఏపీలో కలిసిన గ్రామాలు, రిజర్వేషన్లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం మాట్లాడారు. దేశంలో వంద శాతం అజెండా అమలు చేసిన ఏకైక పార్టీ తెరాస అన్నారు.

హైదరాబాద్: ఏపీలో కలిసిన గ్రామాలు, రిజర్వేషన్లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం మాట్లాడారు. దేశంలో వంద శాతం అజెండా అమలు చేసిన ఏకైక పార్టీ తెరాస అన్నారు. హామీ ఇవ్వని అనేక పథకాలను సైతం తీసుకువచ్చి అమలు చేస్తున్నామన్నారు.

మంత్రివర్గ భేటీ అనంతరం సీఎం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్రం నాటి పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా వేరు అని చెప్పారు. భిన్న పరిస్థితులు ఉన్న రాష్ట్రాలకు రిజర్వేషన్లపై వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. తాము ఇచ్చేది మతపరమైన రిజర్వేషన్లు కాదన్నారు. గతంలో నాలుగు శాతం ఉంటే మేం పెంచుతున్నామన్నారు.

కేంద్రం వెసులుబాటు ఇవ్వకపోతే ఘర్షణ పూరిత వాతావరణం వస్తుందన్నారు. తాము కేంద్రంతో ఘర్షణ కోరుకోవడంలేదన్నారు. ఈ రిజర్వేషన్లకు మోడీ సహకరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. హిందూ -ముస్లీంల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేది ఎవరికో అందరికీ తెలుసన్నారు.

రాష్ట్ర పరిధిలోని అంశాలను ఆయా రాష్ట్రాలకే అప్పగించాలన్నారు. కేంద్రంలోనూ బీసీ మంత్రిత్వశాఖ అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఏపీలో కలిసిన 7 గ్రామాలు తిరిగి తెలంగాణకు తీసుకు వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. ముందస్తు ఎన్నికలు పిచ్చి ఆలోచన అన్నారు.

విద్యుత్ డిమాండ్ ఇప్పుడే ఎక్కువ

విద్యుత్ డిమాండ్ ఇప్పుడే ఎక్కువ

ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉందని కేసీఆర్ అన్నారు. దీని అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌తో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌కు ఒప్పందం చేసుకున్నామన్నారు.

వచ్చే మార్చినాటికి భద్రాద్రిలో రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి జరుగుతుందన్నారు. త్వరలో నార్త్ ఇండియా గ్రిడ్‌కు అనుసంధానం కాబోతున్నట్లు తెలిపారు. దేశంలో ఐదు విద్యుత్ లైన్లు ఏర్పాటు కాబోతున్నాయి. కొత్త లైన్ల ద్వారా ఏ రాష్ట్రమైన ఎంతైనా విద్యుత్ కొనవచ్చన్నారు. పలు ప్రాజెక్టులకు 10 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమన్నారు.

ఎత్తిపోతల పథకాల బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. పేదల అవసరాలు తీరిన తర్వాత పొదుపు చేయడం పద్దతి అని చెప్పారు. ఓయు యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను అధికారికంగా చేస్తామని, రూ.200 కోట్లు కేటాయించామన్నారు.

రిజర్వేషన్లపై..

రిజర్వేషన్లపై..

తెలంగాణ సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు రూపొందించాల్సిన బాధ్యత తమపై ఉందని కేసీఆర్‌ అన్నారు.

గతంలో హెరిటేజ్‌ యాక్టును అసంబద్దంగా చేశారని, రాష్ట్ర హెరిటేజ్‌ యాక్టును తీసుకురావడానికి కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని, గతంలో గవర్నర్‌ ఎమ్మెల్సీ కోటా కింద పనిచేసిన బి రాజేశ్వరరావు, ఫరూఖ్‌ను తిరిగి మరోసారి నియమించాలని కేబినెట్‌ తీర్మానం చేసిందన్నారు.

ఈ మేరకు ప్రతిపాదనను గవర్నర్‌కు పంపిస్తామని చెప్పారు. రూ.17వేల కోట్ల రైతు రుణమాఫీ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. రైతులపై ఉన్న రూ.లక్ష రుణబారం తగ్గించామన్నారు.

ఉద్యమ సమయంలో రిజర్వేషన్లపై ఇచ్చిన హామీ నెరవేరుస్తామన్నారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్‌ ఇవ్వడం లేదని, తాము మేం ఇవ్వబోతున్న రిజర్వేషన్‌ కొత్తది కాదని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో అమల్లో ఉన్నదే అని చెప్పారు. దాన్ని కొంత శాతం పెంచుతున్నామన్నారు.

ఈ నెల 15న

ఈ నెల 15న

ఈ నెల 15న మధ్యాహ్నం 2గంటలకు మంత్రివర్గ భేటీ ఉంటుందని, అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరామని, 16న అసెంబ్లీ సమావేశాలకు పిలవాలని సభాపతిని కోరామని, సమావేశంలో ఎస్టీ, బీసీఈలకు ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై చర్చిస్తామన్నారు.

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ముస్లింల్లోని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయన్నారు. తమిళనాడులో 69, ఝార్ఖండ్‌లో 60, మహారాష్ట్రలో 52శాతం, అరుణాచల్‌ప్రదేశ్‌, ముఘాలయ, నాగాలాండ్‌, మిజోరాంలో 80శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయన్నారు.

గుజ్జర్లు, జాట్లకు 68శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాజస్థాన్‌ ప్రభుత్వం తీర్మానించిందన్నారు. తమిళనాడులో 32 సంవత్సరాలుగా 69 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

బీసీలకు కొంత రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని, బీసీల్లో ఎంబీసీలు, సంచార జాతుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని కోరామన్నారు. బీసీ కమిషన్‌ అధ్యయనం చేసి 6,7 నెలల్లో నివేదిక ఇస్తుంది. బీసీ కమిషన్‌కు అవసరమైన వివరాలివ్వాలని అధికారులను కోరామని చెప్పారు.

ధర్నా చౌక్‌పై..

ధర్నా చౌక్‌పై..

సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎక్కడి నుంచైనా ధర్నా చేయవచ్చని కేసీఆర్ అన్నారు. గతంలో ఉన్న ధర్నా చౌక్ ప్రస్తుతం లుంబిని పార్కుగా మారిందన్నారు. ఎక్కడి నుంచైనా ధర్నా చేసుకోవచ్చన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ధర్నా స్థలం, తేదీలు ఖరారు చేస్తున్నారన్నారు.

ధర్నా చౌక్ వద్ద ధర్నాలపై కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేశారన్నారు. సచివాలయానికి దూరంగా ధర్నాలు చేపట్టాలని చెప్పారు. దేశ పరిణామాలు, ప్రజల డిమాండ్లు పరిగణలోకి తీసుకోము అంటే సరికాదన్నారు. రెండు రాష్ట్రాలలోను నియోజకవర్గాల సంఖ్య పెరగబోతోందని సమాచారం ఉందన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన పంటల బీమా పథకం సమగ్రంగా లేదన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. దేశంలో లేని విధంగా రాష్ట్రంలో మిర్చికి మద్దతు ధర అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+