అరెస్ట్ చేయొచ్చు, నెక్స్ట్ జరగాల్సిందిదే- కేసీఆర్ సంచలనం..!!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక పైన ప్రస్తుతం జరుగుతున్న మంత్రివర్గ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సమయంలోనే పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. కమిటీ నివేదిక పైన చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్య లు తీసుకునే అవకాశం ఉందనే కోణంలో వివరించారు. అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించారు. పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు.

కేబినెట్ నిర్ణయం
కాళేశ్వరం నివేదిక ప్రధాన అజెండాగా తెలంగాణ మంత్రివర్గం భేటీ అయింది. ఇప్పటికే కమిషన్ ఇచ్చిన నివేదిక పైన అధికారుల టీం కేబినెట్ కు 10 పేజీల నోట్ సిద్దం చేసింది. అందులో కమిషన్ ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు.. నాటి ప్రభుత్వం ఉమ్మడిగా కాకుండా.. కేసీఆర్ ఈ ప్రాజెక్టు విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వివరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో పాటుగా హరీష్, ఈటలతో సహా పలువురి అధికారుల ప్రస్తావన చేసినట్లు సమాచారం. కాగా, ఇదే నివేదిక పైన భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ద్వారా ప్రజెంటేషన్ చేశారు. మంత్రుల సందేహాలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

kcr-sensational-comments-on-arrests-in-kaleswaram-case-details-here

కేసీఆర్ మంత్రాంగం
అయితే, కేబినెట్ ఈ వ్యవహారం పైన డీజీ స్థాయి అధికారితో విచారణ కోసం సిట్ ఏర్పాటుకు సిద్దం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి ముందే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలకు కమిషన్ నివేదిక.. కాళేశ్వరం లో జరిగిన నిర్ణయాలను వివరించాలని ఆలోచనతో ఉంది. దీని పైన ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయం లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ తన ఫాం హౌస్ లో సమావేశమయ్యారు. కమిషన్ నివేదిక పైన కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించినదేనని పేర్కొన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.

అరెస్ట్ కు ఛాన్స్
దీనికి కొనసాగింపుగా కొంత మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు.. భయపడ వద్దని వారికి సూచించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదన్నవాడు అజ్ఞాని అని అభివర్ణించారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాళేశ్వరంపై కేబినెట్‌లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దామని.. దానికి అనుగుణంగా కార్యాచరణ, భవిష్యత్ నిర్ణయాలు తీసుకుందామని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు కేబినెట్ లో తీసుకునే నిర్ణయం రాజకీయంగా కీలక మలుపు గా మారే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+