ప్యాంట్ జిప్ తీసి శబరిమల అయ్యప్ప భక్తులతో కేరళ పోలీస్.. ఘాటుగా స్పందించిన రాజాసింగ్!
శబరిమల అయ్యప్ప ఆలయానికి మకరవిళక్కు పూజల కోసం పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాదిమంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి శబరిమల పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. దీంతో శబరిమలలో తీవ్ర రద్దీ నెలకొంది. కిలోమీటర్ల మేర భక్తులు స్వామి దర్శనానికి ఎదురుచూడాల్సి వస్తుంది. విపరీతంగా పెరిగిన చలితో పాటు, రద్దీ కూడా ఎక్కువగా ఉండడంతో అయ్యప్ప స్వాములు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు.
అయ్యప్ప భక్తులతో పోలీస్ అనుచిత ప్రవర్తన
కొత్తగా స్వామి దర్శనానికి వస్తున్న భక్తులు దర్శన మార్గాలు, క్యూలైన్ల వివరాలు తెలియక గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొందరు అయ్యప్ప స్వామి భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ ఎక్కడ అని కేరళ పోలీస్ అధికారిని అడిగినప్పుడు ఆయన చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైంది.

ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి చూపించి అసభ్యంగా పోలీస్ ప్రవర్తన
ఆ పోలీస్ తన ప్యాంటు జిప్ ఓపెన్ చేసి అసభ్యకరమైన సైకిల్ చేసినట్టు అయ్యప్ప భక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది. దీంతో సదర్ పోలీస్ అధికారి పైన తక్షణ చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ సంఘటన నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజా సింగ్ డిమాండ్ ఇదే
శబరిమలలో తెలుగు రాష్ట్రాల భక్తుల పైన పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన వార్తలు, వీడియోల పైన తీవ్రంగా స్పందించిన ఆయన అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తులతో పోలీసులు ఈ విధంగా దురుసుగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదన్నారు. అయ్యప్ప భక్తులతో అనుచితంగా ప్రవర్తించిన కేరళ పోలీస్ అధికారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్, సీఎం చంద్రబాబుకు రాజా సింగ్ విజ్ఞప్తి
ప్రతి సంవత్సరం కేరళలో జరిగే మండల మకర విళక్కు పూజలకు దేశవ్యాప్తంగా భక్తులు వస్తారని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, ఆ భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగించి, మార్గ నిర్దేశం చేయడానికి ఒక ప్రత్యేక కోఆర్డినేటర్ ను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
అయ్యప్ప భక్తుల కోసం కో ఆర్డినేటర్ అవసరం
భక్తుల సమస్యల పరిష్కారానికి, భాషాపరమైన ఇబ్బందులు లేకుండా శబరిమలలో వారికి సహాయం చేయడానికి ఈ కోఆర్డినేటర్ చాలా అవసరమని రాజా సింగ్ పేర్కొన్నారు. అయ్యప్ప భక్తుల పైన అనుచితంగా ప్రవర్తించిన పోలీస్ అధికారిపై మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications