ఏది నిజం?: ఇద్దరు కూతుళ్లను చంపిన రజనీ, వీడని మిస్టరీ
హైదరాబాద్: రజనీ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లను చంపిన ఘటన ఇంకా మిస్టరీగానే ఉంది. తన భర్త తన పెద్ద కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే కారణంతో తాను పిల్లలను చంపినట్లు రజనీ చెప్పింది. భర్త వినయ్ చుట్కేను పోలీసులు విచారించారు.
రజనీ అతనిపై చేసిన ఆరోపణలు నమ్మే విధంగా లేవని అతన్ని విచారించిన తర్వాత పోలీసులు ఓ అభిప్రాయానికి వచ్చారు. రజనీ మానసిక స్థితి సరిగా లేదని వినయ్ చెప్పినట్లు సమాచారం. ఆమె మానసికంగా దృఢంగానే ఉందని ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు చెప్పారు.

దాంతో పోలీసులు రజనీ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. రజనీ గురువారం రాత్రి తన ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన విషయం తెలిసిందే. రజనీని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు. అయితే, కూతుళ్లను రజనీ చంపడానికి గల అసలు కారణమేమిటనే విషయాన్ని పోలీసులు నిర్దారించుకోలేకపోతున్నారు.
ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్న వినయ్, రజనీ తమ ఇద్దరు కూతుళ్లతో సికింద్రాబాదులోని అడ్డగుట్ట టీచర్స్ కాలనీలో నివసిస్తున్నారు. అతను ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, అత్యంత దిగ్బ్రాంతికి గురి చేస్తూ రజనీ తన ఇద్దరు పిల్లలను చంపి, హుస్సేన్ సాగర్‌లో శుద్ధి చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులో తీవ్ర సంచలనం సృష్టించింన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications