కుటుంబ పాలనతో ప్రజలకు ఇబ్బంది: కేసీఆర్‌కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: ప్రజల నమ్మకాన్ని సీఎం కేసీఆర్ వమ్ము చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న 23 సమస్యలపై సీఎం కేసీఆర్‌కు సోమవారం ఆయన సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు.
అందులో ఎన్నికల హామీలకు, ప్రభుత్వ పనితీరుకు పొంతన లేకుండా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యస్పూర్తి కనిపించడం లేదని దుయ్యబట్టారు. ఏకపక్ష నిర్ణయాలు, అధికార కేంద్రీకరణ, కుటుంబపాలనతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి వరంగల్ ప్రజలు బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి అన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే వరంగల్‌లో కేసీఆర్ ప్రచారం నిర్వహించాలని లేఖలో కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

బీసీలకూ సామాజిక భద్రత కల్పించాలి: కృష్ణయ్య
ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకూ సామాజిక భద్రత కల్పించాలని బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్‌లో బీసీల మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నఆయన మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. చట్ట సభల్లో బీసీలకు యాబై శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications