మంత్రులపై కోదండ సంచలన వ్యాఖ్య, రేవంత్ టార్గెట్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే
నిజామాబాద్/రంగారెడ్డి: తెలంగాణ జెఎసి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో లేనివాళ్లు, ఉద్యమాన్ని అణిచివేసిన వారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారని కోదండరామ్ వ్యాఖ్యానించారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రంగారెడ్డి జిల్లా జెఎసి అధ్యక్షుడు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి, ప్రభుత్వ పథకాల్లో వారికి ప్రాధాన్యత కల్పించాలన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించిన వారు నేడు ఎమ్మెల్యేలు అయ్యారని, కొందరు మంత్రులుగా కొనసాగుతుండగా, ఉద్యమంలో పాల్గొన్న వారికి కనీస సహకారం అందడం లేదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి కనీసం ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకున్నవారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. జూన్ 2న నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారుల ఎంపికలో పొరపాట్లు జరిగాయన్నారు.
ఉద్యమకారులకు రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం కల్పించాలన్నారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొని రహదారి ప్రమాదంలో మృతిచెందిన నవాబుపేట మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
ఉద్యమకారులు క్రియాశీలకంగా వ్యవహరించడం వల్లనే ఆంధ్రా పెత్తనాన్ని కూల్చగలిగామని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలిగామన్నారు. రంగారెడ్డి జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌కు కోదండ వినతిపత్రం ఇచ్చారు.
అసెంబ్లీలో సత్యం హత్యను తెస్తా: రేవంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో దళిత యువకుడు తలారి సత్యంను ప్రభుత్వమే హత్య చేయించిందని తెలంగాణ టిడిపి శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి బుధవారం ఆరోపించారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు తెస్తానన్నారు.
ఆర్మూర్‌లో తలారి సత్యం హత్యకు కారణం అధికార పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డే అని ఆరోపిస్తూ బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాల ఐకాస ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.












Click it and Unblock the Notifications