రేవంత్ సొంత ఇలాకాపై కన్నుపడినా.. ప్చ్, టీలో ఏపీలో 'రెడ్డి'యే!
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టై జైలులో ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేకే కేసీఆర్ ఆయనను కుట్రపూరితంగా ఇరికించారని టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే.
అయితే, రేవంత్‌కు పట్టు ఉన్న అతని నియోజకవర్గం కొండగల్ పైన తెరాస కన్ను పడిందని అంటున్నారు. సొంత ఇలాకాలో రేవంత్‌కు ఉన్న పట్టును కదల్చేందుకు తెరాస నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, కష్టకాలంలోను నియోజకవర్గంలో ఎక్కువ మంది రేవంత్ వెంటే నడిచేందుకు సిద్ధంగా ఉంటున్నారంటున్నారు. పార్టీల మాటను పక్కన పెట్టి చాలామంది రేవంత్ కోసం మరో ఆలోచన కూడా చేయడం లేదని అంటున్నారు.
సొంత ఇలాకా కొడంగల్‌లో కోలుకోకుండా చేస్తే రేవంత్ రెడ్డిని మరింత దెబ్బతీయవచ్చునని కొందరు నాయకులు భావిస్తున్నారని, కానీ అది సాధ్యం కావడం లేదని అంటున్నారు.

మరోవైపు, వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ నిశ్చితార్థంలో 'రెడ్డి' అంశంపై పలువురు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ సామాజిక వర్గం ఎక్కువగా వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ, ఇక్కడ ఆ సామాజిక వర్గం టార్గెట్‌గా మారిందనే చర్చ సాగిందంటున్నారు.
తెలంగాణలో రెడ్లు కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తుంటారు. వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. రేవంత్‌ను జైలులో ఇతర పార్టీల ఆ సామాజిక వర్గం నేతలు కూడా కలిశారు. అంతెందుకు, మంత్రి మహేందర్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని మొత్తం వ్యవహారంలో బలిపశువును చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం.












Click it and Unblock the Notifications