KRMB: కృష్ణా నది జలాల కేటాయింపుపై ఇంకా రాని స్పష్టత.. వాదనలు వినిపించిన తెలంగాణ, ఏపీ..
బుధవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 17వ సమావేశం జరిగింది. హైదరాబాద్ లోని జలసౌధలో కేఆర్ఎంబీ ఛైర్మన్ నందన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా జలాల పంపకం ప్రధాన అంశంగా చర్చించారు. అయితే ఈ భేటీలో తెలంగాణ, ఏపీకి ఎలాంటి వాటా ఖరారు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రం 66:34 నిష్పత్తిలో నీటి కేటాయింపులు జరపాలని స్పష్టం చేసింది.
అందుకు అంగీకరించిన తెలంగాణ 50:50 ఉండాలని కోరింది. దీంతో వాటాల కేటాయింపు అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు అప్పగించాలని కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల కేటాయింపులో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు అప్పగించాలని కేఆర్ఎంబీ భేటీలో నిర్ణయించామని తెలంగాణ నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ చెప్పారు. కేంద్ర జలశక్తి నిర్ణయం వచ్చే వరకు త్రిసభ్య కమిటీ సమావేశమై ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలకు అనుమతి ఇస్తుందని వివరించారు.

ట్రిబ్యునల్-1 అవార్డు ప్రకారం తాగునీటికి వినియోగించుకుంటున్న నీటిలో 20% మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, అవార్డును అమలు చేయాలన్న అంశంపై చర్చించాలని తెలంగాణ డిమాండ్ కోరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ఔట్‌లెట్లపై టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినా ఇప్పటికీ అమలు చేయలేదు. దీంతో రెండ దశ టెలిమెట్రీల ఏర్పాటుపై చర్చించాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఆధునీకరణతోపాటు ఏపీ చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ పనులను వెంటనే నిలిపివేయాలన్న అంశాన్ని కూడా తెలంగాణ ప్రస్తావించింది.
శ్రీశైలంలో తెలంగాణ చేపడుతున్న విద్యు త్తు ఉత్పత్తి, రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ సిఫారసుల అమలుతోపాటు తెలంగాణ చేపట్టిన పలు ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు చేపట్టడం లేదని ఏపీ తెలిపింది . పాలమూరు-రంగారెడ్డి కేటాయింపులపై అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ లేవనెత్తింది.












Click it and Unblock the Notifications