మోదీ వేడి తగ్గింది, కాంగ్రెస్ గాడి తప్పింది : ఫ్రంటే ప్రత్యామ్నాయమన్న కేటీఆర్
Recommended Video

హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీ కూటమిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 70 ఏళ్లలో ఆ రెండు పార్టీలు దేశానికి చేసిందేమీ లేదని, వెనుకబాటుతనానికి కారణమని విమర్శించారు. సోమవారం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రచారం నిర్వహించారు.

మోదీ వేడి తగ్గింది, కాంగ్రెస్ గాడి తప్పింది
దేశంలో ప్రధాని నరేంద్రమోదీ వేడి తగ్గిందని విమర్శించారు కేటీఆర్. ఏ సర్వే చూసిన బీజేపీ కూటమికి 150 స్థానాలకే పరిమితం అవుతాయని చెబుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గాడి తప్పిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కూటమి 100 సీట్ల వద్దే ఆగిపోతుందని సర్వేల ద్వారా తేటతేల్లమవుతోందన్నారు. ఇకనైనా పార్టీ నేతలు మాయమాటలు చెప్పొద్దని హితవు పలికారు.

ఆ పార్టీలు గెలిస్తే లాభం లేదు
కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీకి లాభం, బీజేపీ గెలిస్తే కమళ దళానికి మంచి జరుగుతోంది. కానీ తెలంగాణ గడ్డకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నారు. విజులైన ఓటర్లు ఆలోచించి .. తెలంగాణ అభివృద్ధి కోసం ఓటేయాలని కోరారు.

బీజేపీకి వ్యతిరేకం
దేశంలో ప్రాంతీయ పార్టీలు రాజ్యమేలుతాయని జోస్యం చెప్పారు. మాయావతి, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఈ పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

16 + 160
రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేది టీఆర్ఎస్ పార్టీ అని స్పష్టంచేశారు కేటీఆర్. ఆ రెండు పార్టీలు తమ గోడును పట్టించుకోవని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 16 చోట్ల టీఆర్ఎస్, 1 ఎంఐఎంతో కలిసి దేశంలో 160 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల ప్రచారంలో మంత్రి ఈటల రాజేందర్, అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications