కవిత కోసం వారిని కలిసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేటీఆర్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి మార్చి 15వ తేదీ నుండి తీహారి జైలులో ఉన్న సోదరి కల్వకుంట్ల కవితతో ములాఖాత్ కానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు.
కవితతో కేటీఆర్ ములాఖాత్
దీంతో కవిత ఆరోగ్య పరిస్థితి పైన కేటీఆర్ నేడు కవితతో మాట్లాడనున్నారు. కవితతో కేటీఆర్ ములాఖాత్ కానున్న నేపథ్యంలో కవిత ఆరోగ్య పరిస్థితితో పాటు కేసులో ఇప్పటివరకు జరిగిన కీలక వాదనలు, కవిత బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలపై కవితతో కేటీఆర్ చర్చించనున్నారు.

సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటీషన్ పై వాదనలు
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సిబీఐ నమోదు చేసిన కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్ పైన రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారణ చేపడుతుంది. ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే దానిపైన కోర్టు విచారించనుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కవిత భర్త అనిల్ నేడు ఢిల్లీలో కీలకభేటీలు నిర్వహిస్తున్నారు.
కవిత కేసు వాదిస్తున్న న్యాయవాదులతో కేటీఆర్ భేటీ
కవిత కేసు వాదిస్తున్న న్యాయవాదులతో కూడా కేటీఆర్ భేటీ అయినట్టు సమాచారం. కవితకు బెయిల్ వచ్చే అంశం పైన న్యాయవాదులతో కేటీఆర్ చర్చించినట్టు సమాచారం. అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టు ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు.
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో వాదించిన న్యాయవాదులతో భేటీ
ఇదే క్రమంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇతర రాష్ట్రాల్లో అనర్హత కోసం సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాదులతో భేటీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పార్టీ మారిన పదిమంది కోసం హైకోర్టు స్పీకర్ తో పాటు, గవర్నర్ ను కలిశారు బీఆర్ఎస్ ప్రతినిధులు. కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ అలాగే కవిత అనారోగ్యం నేపథ్యంలో కేటీఆర్ నేడు ఎమ్మెల్సీ కవితతో ములాఖాత్ కానున్నారు.దీంతో ఈరోజు కవిత కేసులో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications