ట్వీట్ యుద్ధం: కేటీఆర్ విమర్శలు, కిషన్ సైటైర్లు
హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా సమావేశాలు, బహిరంగ సభల్లోనే గాక సోషల్ మీడియా వేదికగానూ విమర్శలు చేసుకుంటున్నారు.
ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆయనకు ధీటుగా బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి విమర్శలను తిప్పికొట్టారు.

బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుంచి ఓ ప్రతినిధి బృందం తెలంగాణలో పర్యటించి, ఇక్కడి వ్యవసాయం ప్రగతి గురించి తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతుంటే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ దుయ్యబట్టారు.
In democracy states complimenting each other’s schemes is a healthy practice. Hypocrisy is when a delegation led by you visited Gujarat to study the Sabarmati River Front to emulate the same for Musi River Front. I wonder what happened to the Musi River Front project. https://t.co/jY4jHHOpJw
— G.Kishan Reddy,MLA. (@kishanreddybjp) September 17, 2018
కేటీఆర్ విమర్శలపై కిషన్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడ మంచి కనిపించినా మెచ్చుకోవడం ఆరోగ్యకరమైన లక్షణమన్నారు.
తెలంగాణ ప్రతినిధులు కూడా గుజరాత్‌కు వెళ్లి సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిని అధ్యయనం చేసిన విషయాన్ని మరువరాదని గుర్తు చేశారు. అంతేగాక, హైదరాబాద్‌లో మూసీ నది ప్రక్షాళన పనులు ఎక్కడ వరకు వచ్చాయంటూ నిలదీశారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications