కెటిఆర్ కు మంత్రిగా నో ఛాన్స్‌..! కెసిఆర్ వ్యూహాత్మ‌క అడుగులు.. అస‌లు ల‌క్ష్యం ఇదేనా..

Recommended Video

    KTR May Not Join In KCR Cabinet : Horizon Clear For KTR | Oneindia Telugu

    త‌న‌యుడికి ప‌ట్టం క‌ట్ట‌డానికి తండ్రి కెసిర్ వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు. రెండో సారి అధికారంలోకి రాగానే.. ప్ర‌మా ణ స్వీకారం అనంత‌రం త‌న‌యుడికి పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట ప‌ద‌వి అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీని అన్ని స్థాయిల్లో..అన్ని వ‌ర్గాల్లో..తెలంగాణ‌లోని అన్ని ప్రాంతాల్లో బ‌లోపేతం చేయ‌ట‌మే ల‌క్ష్యంగా ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఇక‌, వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా కెటిఆర్‌...లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌రువాత జాతీయ రాజ‌కీయాలే ల‌క్ష్యంగా కెసిఆర్ ప‌ని చేయ‌నున్నారు...దీని కోసం కెసిఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

    వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)

    ప‌క్కా వ్యూహాత్మ‌క అడుగులు..

    ప‌క్కా వ్యూహాత్మ‌క అడుగులు..

    టిఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా నియ‌మించిన కెటిఆర్ కు ఇప్పుడు మంత్రి వ‌ర్గంలో ఛాన్స్ ఉంటుందా..ఉండ‌దా అనే చ‌ర్చ మొద‌లైంది. టిఆర్‌య‌స్ తొలి ప్ర‌భుత్వం పట్ట‌ణాభివృద్ది - ఐటి- గ్రామీణాభివృద్ది శాఖ‌ల‌ను ప‌ర్య‌వేక్షించిన కెటిఆర్ కొత్త ప‌రిశ్ర‌మ‌లను తీసుకురావ‌టంలో స‌క్సెస్ అయ్యారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టిఆర్‌య‌స్ కు 99 సీట్లు తీసుకొచ్చి.. తండ్రికి గిఫ్ఠ్ గా ఇచ్చారు. తాజా ఎన్నిక‌ల్లోనూ గ్రేట‌ర్ లో టిఆర్‌య‌స్ స‌త్తా చాటారు. దీంతో..సెటిల‌ర్లు..విద్యావంతులు.. ఉన్న‌వ వ‌ర్గాల్లో కెటిఆర్ ఇమేజ్ పెరిగిపోయిండి. కెసిఆర్ త‌న‌యుడిగా..పార్టీ వ్య‌వ‌హారాలను చ‌క్క‌బెడుతూ..ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో అసంతృప్తుల‌ను బుజ్జ‌గించ‌టం.. ఎన్నిక‌ల వ్యూహాలు అమ‌లు చేయ‌టంలో కెటిఆర్‌..హ‌రీష్ ఇద్ద‌రూ కీల‌క భూమిక పోషించారు. తాజా ఎన్నిక‌ల్లో కెటిఆర్ ప్ర‌ధానంగా గ్రేట‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ అభ్య‌ర్ధుల గెలుపు కోసం అనుస‌రించిన వ్యూహాలు స‌త్ఫ‌లితాలిచ్చాయి. ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే టు థ‌ర్డ్ మెజార్టీ సాధిస్తామ‌ని.. వంద సీట్ల‌తో అధికారంలోకి వ‌స్తామ‌ని చెప్ప‌టం తో పాటుగా కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రు ఓడిపోతారో కూడా ముందే చెప్పి సంచ‌ల‌నం సృష్టించారు.

    రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)

    క్యాబినెట్ లోకి ఎంట్రీ ఉండ‌దా.. పార్టీ పైనే దృష్టి..

    క్యాబినెట్ లోకి ఎంట్రీ ఉండ‌దా.. పార్టీ పైనే దృష్టి..

    పార్టీలో అధినేత త‌రువాత స్థానం ద‌క్కించుకున్న కెటిఆర్ ఇక పూర్తిగా పార్టీ బాధ్య‌త‌ల‌కే ప‌రిమితం కానున్నారు. వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ క్లీన్ స్వీప్ చేయాల‌నే ల‌క్ష్యంగా కెసిఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందు కోసం కేటీఆర్‌ను ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఐదారు నెలలపాటు కేటీఆర్‌ పూర్తిగా పార్టీ కార్యకలాపాలు, ఎన్నికలకే పరిమితమవుతారని, వాటిని విజయవంతం చేయడంపైనే దృష్టి సారిస్తాయని వివరిస్తు న్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తా చాట‌టం ద్వారా జాతీయ రాజ‌కీయాల్లోనూ త‌న ప్ర‌భావం పెంచుకోవాల‌నేది కెసిఆర్ ఎత్తుగ‌డ‌. దీని ద్వారా జాతీయ రాజ‌కీయాల్లో క్రియా శీల‌కంగా మారాల‌నే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా..ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు త‌ప్ప‌నిస‌రి అవుతుంది. దీంతో..త‌న కు కీల‌క భూమిక ద‌క్కాలంటే 16 లోక్‌స‌భ సీట్లు గెలవాల‌ని భావిస్తున్నారు. కెసిఆర్ ల‌క్ష్యం మేర‌కు అనుకున్న‌ది సాధిం చ‌గలిగితే..లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌రువాత తెలంగాణ లో అనూహ్య రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకొనే అవ‌కాశం ఉంది. అందులో భాగంగా.. కెటిఆర్ కు ముఖ్య‌మంత్రి పీఠం అప్ప‌గించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

    కొత్త‌గా క్యాబినెట్ కూర్పు..కొత్త ఇంట్లోకి కెటిఆర్‌..

    కొత్త‌గా క్యాబినెట్ కూర్పు..కొత్త ఇంట్లోకి కెటిఆర్‌..

    కెటిఆర్ కు క్యాబినెట్ లో స్థానం క‌ల్పించే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ప్ర‌భుత్వంలో ఈ సారి హరీష్ కు మ‌రింత ప్రాధాన్య‌త ల‌భించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు ఉండే అవ‌కాశాలు లేవ‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. పూర్తిగా పార్టీకి..ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధి గా కెటిఆర్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. దీని ద్వారా పార్టీ లో ప్ర‌తీ స్థాయిలోని వారికి ద‌గ్గ‌రై.. త‌న భ‌విష్య‌త్ హోదా ల‌కు ఎక్క‌డా వ్య‌తిరేక‌త రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటు న్నారు. దీని కోసం కెటిఆర కొత్త ఇంట్లోకి మారుతున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలు, నాయకులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన సీఎం కేసీఆర్‌తోపాటు ప్రగతి భవన్లోనే ఉంటున్నారు. అయితే, అక్కడ ప్రొటోకాల్‌ సమస్య కారణంగా కేసీఆర్‌, కేటీఆర్‌లను కలవలేకపోతున్నామన్న అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. కార్య‌క‌ర్త‌ల‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాల‌నే కెసిఆర్ ఆదేశాల మేర‌కు కెటిఆర్ ఇల్లు మారాల‌నే నిర్ణ‌యం తీసుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+