సర్వేలూ మావైపే: కెసిఆర్ ప్రకటనపై కెటిఆర్ ఆశ్చర్యం, ‘లోకేశ్ ఇక్కడ పోటీ చేస్తారా?’
హైదరాబాద్: మున్సిపల్ శాఖను తనకు అప్పగిస్తానన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటన ఆశ్చర్యం కలిగించిందని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటిశాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. మున్సిపల్ శాఖను తనకు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ శాఖను ఛాలెంజ్‌గా తీసుకుని హైదరాబాద్‌లోని అన్ని సమస్యలను పరిష్కారిస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణభవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పేందుకు ఒక్క కారణం లేదని, అలాగే టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయకూడదో చెప్పేందుకు కూడా ఒక్క కారణం లేదన్నారు. 18 నెలల తమ పాలన తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతితల్లి ప్రేమ కురిపిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. అడుగడుగునా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని, స్మార్ట్ సిటీల జాబితాలోనూ తెలంగాణకు స్థానం లేకుండా చేశారన్నారు. గణతంత్ర వేడుకల్లోనూ తెలంగాణ శకటానికి స్థానం కల్పించలేదన్నారు. తెలంగాణను ఇన్ని రకాలుగా అవమానిస్తున్న బిజెపికి గ్రేటర్ ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి? అని కేటీఆర్ ప్రశ్నించారు.

టిఆర్‌ఎస్ వల్లే హైదరాబాద్‌కు న్యాయం జరుగుతదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించామన్నారు. గ్రేటర్ ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడానికి.. తెలంగాణ వ్యతిరేక శక్తులను తిరస్కరించడానికి గ్రేటర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. గ్రేటర్ పీఠంపై టిఆర్‌ఎస్ జెండా తప్పకుండా ఎగురుతుందన్నారు. హైదరాబాద్‌లో అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నేత కావాలని అన్నారు. ప్రజలు విచక్షణతో తీర్పు ఇస్తారని తమకు విశ్వాసముందని పేర్కొన్నారు.
చంద్రబాబుకు తిరస్కరణే
హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానన్న చంద్రబాబును 2004లోనే గ్రేటర్ ప్రజలు తిరస్కరించారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. టిడిపి ఆంధ్రా ప్రాంతానికే పరిమితమైన పార్టీ.. చంద్రబాబు కూడా ఆంధ్రాకే పరిమితమన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి హైదరాబాద్‌తో పనేంటని ప్రశ్నించారు.
అమరావతికి నిధులు తెచ్చుకోలేని వారు తెలంగాణకు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. సొంత రాష్ర్టానికే నిధులు తెచ్చుకోలేదు గానీ, ఇక హైదరాబాద్‌కు ఏం చేస్తారు? అని నిలదీశారు. హైదరాబాద్ అభివృద్ధి టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, టిఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.
లోకేష్ తెలంగాణలో పోటీ చేస్తారా?
టిడిపి నేత నారా లోకేశ్ తాను ఇక్కడే పుట్టానని, లోకల్ అంటున్నారని.. ఎన్నికల్లో పోటీచేయాల్సి వస్తే ఎక్కడ పోటీ చేస్తారో? చెప్పాలని డిమాండ్ చేశారు. బీహార్ నుంచి జార్ఖండ్ ఆవిర్భవించాక అక్కడ ఆర్జేడీ కనుమరుగైందని, అలాగే తెలంగాణలో టిడిపి కథ ముగిసినట్లేనన్నారు.
స్మార్ట్ సిటీల ఎంపిక, నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ విధానాలు సరిగా లేదని కేటీఆర్ విమర్శించారు. నగర జనాభా ప్రకారం నిధులు మంజూరు చేయాలని కేసీఆర్ ఇచ్చిన సలహాను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. కోటికి పైగా ఉన్న నగరాలకు, 8లక్షల జనాభా ఉన్న కాకినాడకు ఒకేలా నిధులు ఇస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.
తెలంగాణ హక్కుగా ఇవ్వాల్సిన నిధులు తప్ప ఒక్క పైసా కూడా కేంద్రం ఎక్కువ ఇవ్వలేదని కేటీఆర్ తెలిపారు. కేంద్రం ఒక మిథ్య అని ఎన్టీఆర్ ఏనాడో చెప్పారని... రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే కేంద్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు.
గెలుపు ఖాయం
గ్రేటర్ ఎన్నికల్లో స్థానిక తెలంగాణ వాసులతో పాటు నగరానికి వలసవచ్చి స్థిరపడిన వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా తెరాసకే మద్దతు పలుకుతున్నారని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం అత్తాపూర్ డివిజన్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజల స్పందన చూస్తుంటే గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమైందని అన్నారు.
-
KTR on Speaker Decision: దానం, కడియంకు క్లీన్ చిట్టా ? కేటీఆర్ షాకింగ్ ..! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications