Telugu Students: హిమాచల్‍ప్రదేశ్‍లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. స్పందించిన కేటీఆర్..
ఉత్తరభారతంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరదలకో పర్యటకులు ఉక్కిబిక్కిరి అవుతున్నారు. కులు, మనాలీలో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చామని ట్విట్టర్ పోస్ట్ చేశారు.
కులు, మనాలీలో చిక్కుకున్న విద్యార్థులను క్షేమంగా తెలంగాణకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధంచి ఢిల్లీలోని రెసిడెంట్ కమీషనర్ తో సంప్రదించినట్లు పేర్కొన్నారు. సాయం కావాల్సిన వారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ సంప్రదించాలని కోరారు. మరోవైపు భారీ వరదలతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వానలు భారీగా పడుతున్నాయి.

హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ నదులు తీవ్రరూపం దాల్చాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్, రావి, సట్లేజ్ నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. బాస్పా, వాంగ్టో, నథ్పా ప్రాజెక్టులు నిండిపోయాయి. వచ్చే మూడు రోజుల పాటు మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కాంగ్రా, బిలాస్‌పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, ఉనా, హమీర్‌పూర్, మండి, కుల్లు-మనాలి, కిన్నౌర్, చంబా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి.
Have received information from some distressed parents that a few Telugu students are stuck in
— KTR (@KTRBRS) July 11, 2023
Kullu and Manali of Himachal Pradesh
Have alerted our Resident Commissioner in New Delhi to assist the students
If anyone needs assistance they can reach out to @TS_Bhavan or…
ఈ భారీ వర్షాల కారణంగా 72 మందికి పైగా మృతి చెందారు. భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగింది. భారీ వర్షాలతో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. ఢిల్లీలో యమునా నది తీవ్రరూపం దాల్చింది. ప్రమాదస్థాయిలో ప్రవాహిస్తోంది. నది పరివాహాక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.












Click it and Unblock the Notifications