Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అరెస్ట్ కు మేము సిద్దం, లెక్క తేలుస్తాం - కేటీఆర్..!!

మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాల్లో ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. నవంబర్ తొలి వారంలో అరెస్టులు ఉంటాయని చెప్పుకొచ్చారు. దీని పైన స్పందించిన కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. నిజమైన బాంబులకే తాము భయపడలేదని.. ఏం చేస్తారో చేసుకోమని సవాల్ విసిరారు.

మేము సిద్దం
త్వరలోనే బీఆర్ఎస్ నేతల అరెస్టులు తప్పవని..బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలానికి కారణమయ్యాయి. మంత్రి కేటీఆర్ తాము ఎలాంటి బాంబులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ వంటి వారితోనే పోరాటం చేశామని.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ వ్యాఖ్యానించారు. తాము ఒరిజనల్ బాంబులకే భయపడలేదన్నారు.

KTR Seriously reacts over Ponguleti comments on Cases against BRS leaders

భయ పడేది లేదు
దొంగ కేసులు పెడితే పెట్టుకోవాలని..ముందు పొంగులేటి తన ఈడీ కేసులు, మోడీ కాళ్ళు మొక్కిన బాంబుల గురించి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేసారు. తాము చంద్రబాబు, వైస్సార్‌తోనే కొట్లాడినామని గుర్తు చేసారు. ఈ చిట్టి నాయుడు ఓ లెక్కనా అంటూ వ్యాఖ్యానించారు. అడ్డమైన కేసులు పెట్టి జైలుకు పంపితే పంపు అంటూనే.. ఆర్‌ఆర్ టాక్స్‌లపై తాము వచ్చాక లెక్క తెలుస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ బామ్మర్ది, పొంగులేటి బాగోతాలు అన్నీ బయటకు తీస్తామని... చావుకు మేం భయపడమని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఛార్జీలు పెంచద్దు
సిరిసిల్లలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయన్నారు. విద్యుత్‌ను వ్యాపార ధోరణిలో చూడొద్దని తెలిపారు. విద్యుత్ భారం కాదని.. బాధ్యతగా ప్రభుత్వం భావించాలని సూచించారు. పేదల నడ్డి విరిచేలా సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రూ.963 కోట్ల చార్జీలు ప్రజల మీద రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల మీద తాము భారం పడనివ్వలేదని చెప్పుకొచ్చారు. 300 యూనిట్లు దాటితే.. ఒక్క యూనిట్‌కు 50 రూపాయలా.. ప్రభుత్వ ఖజానా నింపుకునేది ఇలాగేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+