పెట్రో ధరలు పెంచింది మీరే, తగ్గించాల్సింది..: కేంద్ర సర్కారుపై కేటీఆర్ ఫైర్

రంగారెడ్డి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచిందన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటు చేసిన లారీ యాజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

అభివృద్దే తమ కులమని.. సంక్షేమమే తమ మతమని.. జనహితమే త అభిమతమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫ్లోరోసిస్ ను రూపుమాపింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. మిషన్ కాకతీయలో చెరువులు బాగుచేశామన్నారు. ఈరోజు మూడున్నరకోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుందన్నారు. అందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు.

 KTR slams central govt for oil prices

ఎనిమిదేళ్లుగా ఒకే మాట మీద అందరూ నడస్తున్నామని.. కుల, మత, తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 24 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. కానీ, కేంద్రం మాత్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నూకలు తినండని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించిందని కేటీఆర్ ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వమే పెట్రోల్ ధరలు పెంచిందన్నారు మంత్రి కేటీఆర్. ధరలను పెంచిన కేంద్రమే తగ్గించాలని సీఎం కేసీఆర్ అన్నారని తెలిపారు. లీటరు పెట్రోలు రూ. 70, లీటర్ డీజిల్ ధర రూ. 65లకే ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+