"మున్సిపల్‌ ఫలితాల్లో 34 చోట్ల హంగ్"

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్‌ ఫలితాల్లో 34 చోట్ల హంగ్ ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల అరాచకాలకు పాల్పడుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తమ కార్పొరేటర్లను పోలీసుల ద్వారా ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు. తమకు ఎక్స్‌ అఫీషియో ఓటుపై కూడా ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో ఈనెల 11న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 1,347 వార్డుల్లో విజయం సాధించి 66 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్‌ 717 వార్డుల్లో గెలుపొంది 13 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది.

ఇక బీజేపీ అభ్యర్థులు 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో విజయం సాధించారు. 34 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే మిగతా స్థానాల్లో హంగ్ ఏర్పడింది. దాంతో ఆయా ఫలితాలపై ఆసక్తి నెలకొంది.


అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్‌ ఫలితాల్లో 34 చోట్ల హంగ్ వచ్చిందన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల అరాచకాలకు పాల్పడుతోందని అన్నారు. తమకు ఎక్స్‌ అఫీషియో ఓటుపై కూడా ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. "సింగరేణిలో దోపిడీని నిరోధించేందుకు సీపీఐతో కలిసి ఉంటామని చెప్పా. సింగరేణిలో కాంగ్రెస్‌, బీజేపీ భాగస్వాములై దోచుకుంటున్నారు. కొత్తగూడెంలో సీపీఐపై ఏం ఒత్తిడి పనిచేసిందో తెలియదు" అని కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR Slams Congress party Anarchy in Many Places After 34 Hung Seats in Municipal Polls results

ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో ఎస్ఈసీ వెల్లడించింది. కాంగ్రెస్‌ కు 39.08 శాతం, బీఆర్‌ఎస్‌ కు 28.75 శాతం, బీజేపీకు 15.67 శాతం, స్వతంత్రులకు 8.30 శాతం, ఎంఐఎంకు 3.28 శాతం, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి 1.5 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం, జన సేనకు 0.3 శాతం ఓట్లు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+