నువ్వా కేసీఆర్‌ పేరును తుడిచేది..!!

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్ఎస్ లక్ష్యంగా రేవంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మూసీ విషయంలోనూ రేవంత్ తన వైఖరి తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కేసీఆర్ ను మర్చిపోయేలా చేసానని చెప్పుకొచ్చారు. దీని పైన ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ ను కార్నర్ చేసారు. కేసీఆర్ తెలంగాణకు ఊపిరి పోసారని పేర్కొన్నారు.

తాను కేసీఆర్ ను ప్రజలు మర్చిపోయేలా చేసానని రేవంత్ చేసిన వ్యాఖ్యల పైన కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ ద్వారా రేవంత్ కు ప్రశ్నలు సంధించారు. చిట్టి నాయుడు.. నువ్వా కేసీఆర్‌ పేరును తుడిచేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత కేసీఆర్‌ అని చెప్పారు. నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోశాడని తెలిపారు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడని పేర్కొన్నారు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు.. ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టారని చెప్పుకొచ్చారు.

KTR strong counter for CM revanth over his comment on KCR

సీఎం రేవంత్ ను ఉద్దేశించి.. నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోశాడని ఎక్స్‌ వేదికగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తాజాగా రేవంత్ తన లక్ష్యం గురించి వివరించారు. తనకు గేమ్ ప్లాన్ పైన పూర్తి స్పష్టత ఉందన్నారు.

రాజకీయంగా నష్టం జరిగినా ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌, కా ళేశ్వరం, విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ జరుగుతున్నదని, విచారణ సమయంలో కక్ష సాధింపులు ఉండబోవని, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఫోన్‌ ట్యా పింగ్‌ నిందితుల పాస్‌పోర్ట్‌ రద్దయిందని, కాబట్టి అనధికారికంగా విదేశాల్లో ఉండలేరని చెప్పారు. తనది చిన్న వయసని, రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉందని ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తానని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+