హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం వేళ కీలక నిర్ణయం..!!
వినాయక నిమజ్జనానికి భాగ్యనగరం ముస్తాబు అవుతోంది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం పై కొనసాగుతన్న సందిగ్ధతకు స్పష్టత వచ్చింది. హుస్సేన్‌సాగర్ వద్ద బొజ్జ గణపయ్య నిమజ్జనాలపై జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు తాజా మార్గదర్శకాలు జారీ చేసారు. ఖైరతాబాద్ నుంచి సచివాలయం వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగొద్దనే ఆ క్రేన్లను నెక్లెస్ రోడ్డుకు మళ్లించాలని నిర్ణయించారు.
పర్యవేక్షణ
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి వచ్చే వినాయక విగ్రహాల సంఖ్యకు తగ్గట్లుగా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకునేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రద్దీ తక్కువ ఉంటే ట్యాంక్‌బండ్‌కు నిమజ్జన వేడుక నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన నాలుగు క్రేన్లను తొలగించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

కీలక సూచనలు
వినాయక విగ్రహాలను జలాశయాల్లో కాకుండా స్థానికంగా తాత్కాలిక కొలనులు ఏర్పాటు చేసుకొని నిమజ్జనం చేయాలి. దీనివల్ల ఉత్పత్తయిన వ్యర్థాలను స్థానిక సంస్థ లు 24 గంటల్లోపు తరలించాలని సూచించింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనం వేళ సైన్‌బోర్డులు, అగ్నిమాపక పరికరాలు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఇక, ర్థాల సేకరణ కోసం ప్రతి కొలను, జలాశయం వద్ద కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పూజా, ఇతర వ్యర్థాలను గణేశ్ నిమజ్జనానికి ముందే సేకరించాలని స్పష్టం చేసింది.
నిరంతర పర్యవేక్షణ
హుస్సేన్‌సాగర్‌లో క్లీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాగర్‌లోని వ్యర్థాలను తొలగించే బాధ్యతను హెచ్‌ఎండీఏ, రోడ్లను శుభ్రం చేసే బాధ్యతను జీఎచ్ఎంసీ తీసుకుని పనులు మొదలుపెట్టాయి. ప్రకృతికి హాని కలిగించే గణేశ్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు హుస్సేన్‌సాగర్‌లో, నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన కొలనులో పేరుకుపోయిన వ్యర్థాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తొలిగించి ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications