Nalgonda: నల్గొండ జిల్లాలో చిరుత కలకలం.. డంపింగ్ యార్డ్ లో కళేబరం గుర్తింపు..
నల్గొండ జిల్లాలో చిరుత పులి మృతి కలకలం సృష్టిస్తోంది. చందనపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లో చిరుత కళేబరం కనిపించింది. కొద్ది రోజుల క్రితం ఊర పందిని తిన్న చిరుత పులి చనిపోయినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.బుధవారం డంపింగ్ యార్డ్ ప్రాంతంలో కొందరు చిరుత కళేబారాన్ని చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు.
అక్కడికి చేరుకున్న అటవీ శాఖ, పోలీసు అధికారులు చిరుత పులి కళేబారాన్ని పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కేశరాజుపల్లి, ఎస్టీ కాలనీ, చందనపల్లి, శేషమ్మగుడెం గ్రామాల్లో చిరుత పులి కనిపించిన స్థానికులు తెలిపారు. అధికారులు ఈ ప్రాంతంలో చిరుత పులి సంచరించిన తెలిపారు.

చిరుత పులి ఊర పందిని తినడంతోనే మరణించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఊర పందులను పట్టుకోవడానికి మందులు పెట్టినట్లు భావిస్తున్నారు. మందు తిన్న పందిని చిరుత పులి తిని చనిపోయి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా కళేబరాన్ని పోస్టుమార్టంతో పాటు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నట్లు తెలిపారు అధికారులు.












Click it and Unblock the Notifications