TGSRTC లిమిటెడ్ ఆఫర్.. అందిపుచ్చుకోండి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. పండగ సీజన్ లల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి నగదు బహుమతులను అందజేయడం వంటి పథకాలతో ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెంచుకుంటోంది.

ఇటీవలే ఓ కొత్త ఆఫర్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. ప్రయాణ ఛార్జీలో 20 నుంచి 25 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. సూపర్ లగ్జరీ, లహరి ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గించింది.

Limited Time Offer Enjoy Reduced Prices on T24 Tickets with TGSRTC

సూపర్ లగ్జరీలో ప్రస్తుతం అమలులో ఉన్న ఛార్జీలో 20 శాతం, లహరి ఏసీ బస్ సర్వీసుల్లో 25 శాతం మేర తగ్గించినట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఒక్కో టికెట్ మీద 100 నుంచి 150 రూపాయలకు పైగా తగ్గింపు లభిస్తుంది. దీనికి మంచి డిమాండ్ లభిస్తోంది.

ఈ క్రమంలో మరో ఆఫర్ ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు 'ఫ్రీడమ్ ఆఫర్' ప్రకటించింది. టీ-24 టికెట్లపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ ఆఫర్ ప్రకారం- పెద్దలకు ప్రస్తుతం ఉన్న రూ. 150 టికెట్ ధర రూ. 130కి తగ్గింది. మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ. 120 నుండి రూ. 110కి తగ్గించారు. పిల్లలకు రూ. 100 టికెట్ ధర రూ. 90కి తగ్గింది. టీ-24 టికెట్‌తో ప్రయాణికులు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+