మహిళల ఉచిత బస్సు ప్రయాణం లో కీలక మార్పులు..!!
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లో కీలక మార్పుల చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు ఏపీ లోనూ ఈ పథకం అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో పథకం అమలును మరింతగా విస్తరించేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మరో కేటగిరీ బస్సుల కు ఈ పథకం అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు స్కీం కు ఆదరణ పెరుగుతోంది. లబ్దిదారుల సంఖ్య గణనీయంగా ఉంది. ఇప్పటి వరకు ఈ పథకంలో భాగంగా మహిళలకు సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అమలు చేస్తున్నారు. ఇప్పుడు మెట్రో ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఈ పథకం వర్తించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా టీజీఆర్టీసీ కొత్తగా మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందు బాటులోకి తెచ్చింది. మరో 500 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణా ళికలు సిద్దం చేసింది.
ఈ మెట్రో ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింపు పైన ఇప్పటి వరకు స్పష్టత లేదు. కాగా, ఈ విషయంపై టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. మెట్రో ఎలక్ట్రిక్ బస్సులపై మహాలక్ష్మి ఫ్రీ పథకం వర్తిస్తుందని స్టిక్కర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మోడ్రన్ లుక్, కంఫర్ట బుల్ సీటింగ్ తో నాన్ ఏసీ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను టీజీఎస్‌ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం అందు బాటులోకి తెచ్చినట్లు అధికారులు వివరించారు. సాధారణ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులు చాలా సౌకర్యంగా ఉండటంతో వాటిలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం వీటికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications