ఎలక్ట్రిక్ వాహనాల అడ్డాగా తెలంగాణ: మహీంద్ర అండ్ మహీంద్ర ఈవీ తయారీ యూనిట్ శంకుస్థాపన
హైదరాబాద్: భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఆర్టీసీలో, ప్రైవేట్ వాహన రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తెలంగాణ అడ్డాగా మారాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారికి సంబంధించిన అన్ని రకాల విడిభాగాలు తయారయ్యే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మహీంద్రా అండ్ మహీంద్రా వారు తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రిక్ పాలసీ నచ్చి రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టడం సంతోషంగా ఉందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమ స్థాపనకు కావాల్సిన అన్ని అనుమతులను 21 రోజుల్లో ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. టీఎస్ ఐపాస్ పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు కేటీఆర్. తెలంగాణ వచ్చిన తర్వాత 23 వేల పరిశ్రమలు నెలకొల్పామని.. మూడు లక్షల 30 వేల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 20 లక్షల మందికి ఉపాధి అవకశాలు లభించాయని వెల్లడించారు.
Minister @KTRBRS joined the groundbreaking ceremony for @mahindralmm's new manufacturing unit at its existing plant in Zaheerabad.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 24, 2023
The plant, which is part of Mahindra & Mahindra's ₹1000 Cr investment in Telangana, will provide jobs to about 1000 individuals in the region. pic.twitter.com/m2jHv5PoQJ
కొత్తగా వచ్చే కంపెనీలలో స్థానిక యువతకు పెద్దపీట వేసి ఉద్యోగాలు ఇస్తామన్నారు కేటీఆర్. జహీరాబాద్ ప్రాంతంలోని స్థానిక యువత కోసం ప్రభుత్వ పరంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని.. ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్ పెంచుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావుతోపాటు కంపెనీ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications