ప్రవర్తనపై అనుమానం: భార్యనూ పిల్లలనూ చంపేసి ఆత్మహత్య

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. భార్యను, ఇద్దరు పిల్లలను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం ఎస్సీ కాలనీకి చెందిన జెట్టి సురేష్ (32) తన భార్య సరితను (28), ఇద్దరు కుమారులు నరేందర్ (9), నాగచైతన్య(7)ను కిరాతంగా గొంతు నులిమి హతమార్చి తాను ఇంట్లోని పడక గదిలో దూలానికి చీరతో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ఆదివారం జరిగిన ఈ విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది. భద్రాచలం మండలం గుండాల కాలనీకి చెందిన జెట్టి సురేష్‌కు అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన సరితతో వివాహమైంది. గుండాలలో నివసిస్తు న్న వారి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. భార్య ప్రవర్తనపై అనుమానంతో తరచూ వేధించేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కిందట భద్రాచలం మండలం గుండాల నుంచి అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి వచ్చారు.

Man commits suicide after killing wife and children

వారికి పాలు పోసే వ్యక్తి ఆదివారం ఉదయం వెళ్లి తలుపు తట్టగా ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన పాల వ్యాపారి చుట్టుపక్కల వారికి సమాచారం ఇ చ్చాడు. చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకుని ఇంటి కిటికీలోంచి చూడగా ఇంటి దూలానికి సురేష్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. సురేష్ భార్య సరిత, ఇద్దరు కుమారులు మంచాలపై శవాలై కనిపించారు. పడక గదిలో ఉన్న రెండు మంచాల మధ్య రక్తపు మరకలు ఉన్నాయి.

తల్లిబిడ్డల మృతదేహాలను పరిశీలించగా సరిత నోరు, ముక్కు, ముఖంపై రక్తపు మరకలు ఉన్నాయి. పెద్ద కుమారుడు నరేందర్ నోటిలో నుంచి రక్తం కారిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. భార్యపై ఉన్న అనుమానంతోనే ఆమెను, ఇద్దరు కుమారులను శనివారం అర్ధరాత్రి ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో లోపల తలుపు గడియ పెట్టి గొంతు నులిమి చంపి తాను కూడా ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+