ఆసరా పింఛన్ రాలేదని ఆవేదనతో వృద్ధుడి మృతి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా ఫించను రాలేదని ఆవేదనకు గురైన ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం చిలుపోడు గ్రామంలో జరిగింది.

చిలుపోడు గ్రామానికి చెందిన రుద్రాక్షుల చంద్రయ్య (77) ఫించను డబ్బుల కోసం గ్రామ పంచాయితీ కార్యాలయానికి వెళ్లాడు. జాబితాలో ఆయన పేరు లేకపోలేదని సిబ్బంది చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
పింఛన్ డబ్బులు రాకపోతే జీవనం ఎలా సాగించాలంటూ స్ధానికులు వద్ద వాపోయిన చంద్రయ్య రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications