చెల్లెలు ఆత్మహత్యకు కారణమైన మరిదితో వివాహేతర సంబంధం, చివరికి...

పాడుబడిన బావిలో లభించిన ద్విచక్ర వాహనంతో ఓ హత్య కేసును హుస్నాబాద్‌ పోలీసులు ఛేదించారు. బంధువులే అతడిని హత్య చేశారని గుర్తించారు.

సిద్ధిపేట: పాడుబడిన బావిలో లభించిన ద్విచక్ర వాహనంతో ఓ హత్య కేసును హుస్నాబాద్‌ పోలీసులు ఛేదించారు. బంధువులే అతడిని హత్య చేశారని, మృతుడు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన పిట్టల యాదేశ్వర్‌(38)గా గుర్తించారు. మృతదేహన్ని మూడు నెలల తరువాత బయటకు తీసి పంచనామా చేశారు.

మంగళవారం హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో సిద్దిపేట ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐ శ్రీనివాస్‌జీతో కలిసి ఘటన వివరాలను వెల్లడించారు.

ఈ నెల 3వ తేదీన హుస్నాబాద్‌ మండలం కూచనపల్లి గ్రామ శివారులోని పాడుబడిన బావిలో ప్యాషన్‌ ప్రో బైక్‌ పడి ఉందని గ్రామ పోలీస్‌ అధికారి కుమారస్వామికి కొందరు సమాచారమివ్వడంతో హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

వాహనం గురించి వాకబు చేయగా మిరుదొడ్డి మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన పిట్టల యాదేశ్వర్‌కు చెందినదని తెలిసింది. మిరుదొడ్డికి వెళ్లి విచారణ చేయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Man killed in Siddipet district

భార్య ఆత్మహత్య

యాదేశ్వర్‌కు జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపూర్‌కు చెందిన బిక్షపతి కూతురు శాలుబాయితో వివాహమైంది. యాదేశ్వర్‌ భార్యను నిత్యం వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై 2015లో మిరుదొడ్డిలో అతడిపై కేసు నమోదైంది.

వివాహేతర సంబంధం

శాలుబాయి అక్క బుచ్చమ్మ అమ్మాపూర్‌లో తన ఇద్దరు పిల్లలను విడిచి లక్ష్మీపూర్‌లో ఓ వ్యక్తితో పాటు, యాదేశ్వర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్ని రోజుల తరువాత తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరడంతో యాదేశ్వర్‌ నిరాకరించాడు.

ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవలు జరగడంతో బుచ్చమ్మను 2016లో హత్యచేశాడు. దీనిపై భూంపల్లి పోలీస్‌స్టేషన్‌లో యాదేశ్వర్‌పై కేసు నమోదైంది. పై రెండు కేసుల్లో అరెస్టయి జైలుకెళ్లి వచ్చాడు.

కనిపించకుండా పోయాడు

ఈ క్రమంలోనే ఉగాది పండుగ తరువాత యాదేశ్వర్‌ ఊర్లో కనిపించకుండా పోయాడు. కొడుకు కనిపించడం లేదని యాదేశ్వర్‌ తండ్రి యాదయ్య మిరుదొడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదైంది. యాదేశ్వర్‌ బైక్‌ బావిలో దొరకడంతో అతని సెల్‌ కాల్‌ డేటాను తెప్పించుకుని పరిశీలించగా హత్య కేసు వెలుగులోకి వచ్చింది.

కాల్‌డేటాలోని అనుమానిత వ్యక్తి బుచ్చమ్మ అల్లుడు అయిన గుజరాతి సంజీవ్‌ను పోలీసులు విచారించగా.. అక్కచెల్లెళ్లను పొట్టనబెట్టుకున్నాడే కక్షతోనే బుచ్చమ్మ కుమారులైన బచ్చన్నపేట మండలం కట్కూర్‌కు చెందిన కలియ రవీందర్‌, కలియ రవిలు బుచ్చమ్మ తమ్ముడైన అమ్మాపూర్‌కు చెందిన గుజరాతి ఇస్తారితో కలిసి యాదేశ్వర్‌ గొంతు నులిమిచంపినట్లు ఒప్పుకున్నారు.

కేసులు వెనక్కి తీసుకొని మూడో కూతుర్ని ఇవ్వాలని

వీరందరు మామిడి తోటల కాంట్రాక్ట్‌లు పడుతుంటారని ఏసీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో యాదేశ్వర్‌పై ఉన్న కేసులు ట్రయల్‌కు రావడంతో కేసులను విరమించుకోవాలని కోరేందుకు అక్కన్నపేట మండలం గండిపల్లిలో మామిడి తోట కాంట్రాక్ట్‌ పట్టిన తన మామ బిక్షపతి వద్దకు ఈ ఏడాది ఏప్రిల్‌ 5న వచ్చాడు.

అక్కడ బిక్షపతి మూడో కూతురుని చూసి, కేసులను విరమించుకుని మూడో కూతురును తనకివ్వాలని యాదేశ్వర్‌ కోరాడు. ఈ విషయం తెలుసుకున్న రవి, రవీందర్‌, సంజీవ్‌, ఇస్తారిలు అక్కడకు వచ్చి యాదేశ్వర్‌ను కట్టెలతో కొట్టి గొంతు నులిమి చంపారు.

శవాన్ని బైక్‌పై తీసుకెళ్లి అమ్మాపూర్‌ శివారులోని కుంట వద్ద పాతిపెట్టారు. బైక్‌ను సంజీవ్‌, రవిలు కూచనపల్లి శివారులోని పాడుబడిన బావిలో పడవేశారు.

గుజరాతి సంజీవ్‌ను అదుపులోకి తీసుకొని పాతిపెట్టిన శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఏసీపీ వివరించారు. నిందితులు కలియ రవీందర్‌, గుజరాతి ఇస్తారి, కలియ రవి, గుజరాతి సంజీవ్‌లను అరెస్ట్‌ చేసి, రెండు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు, గడ్డపార, పార, కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

చిన్న క్లూతో హత్య కేసును ఛేదించిన సీఐ శ్రీనివాస్‌జీ, ఎస్‌ఐ సంజయ్‌, తిరుపతి, గ్రామ పోలీస్‌ అధికారి కుమారస్వామి, హుస్నాబాద్‌, సిద్దిపేట పోలీసులను ఏసీపీ నర్సింహారెడ్డి అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+