భార్యను గొడ్డలితో నరికేసి ఉరేసుకున్నాడు

ఖమ్మం: తాగుడుకి బానిస అయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను హత్య చేశాడు. భార్యను గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం ఎర్రగుంటలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

man kills wife and commits suicide

సన్నెపల్లి రమేష్ (46) తాగుడికి బానిసయ్యాడు. ఈ స్థితిలో కనిపించిన అందరి దగ్గరా డబ్బులు తీసుకుని తాగేవాడు. దానికోతుడు, ఇంటిలోని అన్ని వస్తువులను కూడా అమ్మి తాగడం ప్రారంభించాడు. చివరికి భార్య మెడలోని మంగళసూత్రాన్ని కూడా అమ్మేసినట్లు చెబుతున్నారు.

అయితే, గురువారం ఉదయం తాగి ఇంటికి వచ్చిన రమేష్ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఒళ్లు తెలియక రమేష్ భార్యను గొడ్డలితో నరికాడు. దాంతో ఆమె అక్కడికక్కడే అసువులు బాసింది. ఆ తర్వాత రమేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, వారికి ఓ కూతురు ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+