మార్గదర్శి పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టు- ఏపీలో సోదాలు జరిగితే మాకేం సంబంధం?

ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులపై సోదాలను నిలిపివేయాలని కోరుతూ మార్గదర్శి యాజమాన్యం ఇవ్వాళ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుపై ఇటీవలే ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై విస్తృత దాడులను నిర్వహించిన అనంతరం ఈ మేరకు కేసు పెట్టారు. చిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఆ సంస్థ యాజమాన్యం ఉల్లంఘించినట్లు తేలడంతో కేసు నమోదు చేశారు. ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు.

ఈ కేసులో మార్గదర్శి మేనేజర్లను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్ కు పంపించింది కోర్టు. సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా డిపాజిటర్ల సొమ్మును అక్రమంగా బదలాయించిందనేది మార్గదర్శి యాజమాన్యంపై ఉన్న ప్రధాన ఆరోపణ. రాష్ట్రవ్యాప్తంగా ఈ తనిఖీలు సాయంత్రం వరకూ కొనసాగాయి. ఇదివరకు ఏపీ సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలను నిర్వహించారు. అప్పట్లో కేసులేవీ నమోదు కాలేదు.

ఈ దఫా- ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, కొందరు బ్రాంచ్ మేనేజర్లపై కేసు నమోదు చేయడం- చర్చనీయాంశమౌతోంది. ఐపీసీ సెక్షన్ 120 (బీ), 409, 420, 477 (ఏ) , రెడ్ విత్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. ప్రధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, అనంతపురం బ్రాంచిల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఏపీ సీఐడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Margadarsi Chit filed a petition in Telangana High Court, here is the details

మార్గదర్శి ఛిట్ ఫండ్ పై తొలిసారిగా 2006లో అప్పటి లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసును హైకోర్టు 2014లో కొట్టి వేసింది. దీన్ని సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ 2020లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది.

తాజాగా- మార్గదర్శి యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుపై దర్యాప్తు నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. తనికీలను నిలిపివేయాలని కోరింది. రామోజీ రావు, శిరీషపై చర్యలు తీసుకోకుండా ఏపీ సీఐడీని ఆదేశించాలంటూ ఈ పిటీషన్ లో పొందుపరిచింది. దీనిపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఇక్కడ పిటీషన్ ఎందుకు వేశారంటూ మార్గదర్శి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఏపీలో సోదాలు జరిగితే తెలంగాణ హైకోర్టు కు సంబంధం ఏమిటని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+