నెక్లెస్ రోడ్,జీహెచ్‌ఎంసీ తొలిగిస్తారా - హైడ్రాకు అసద్ నిలదీత..!!
హైడ్రా కూల్చివేతల పై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ లో చెరువులను కాపాడేందుకే ఆక్రమణలను కూల్చివేస్తున్నామని ఇందులో ఎలాంటి కక్ష, రాజకీయాలు లేవని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. ఎంత ఒత్తిడి వచ్చినా ఆక్రమణలను తొలిగిస్తామని తేల్చి చెప్పారు. హైడ్రా తమ పని తీరు గురించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. హైడ్రా కూల్చివేతల పైన ఎంఐఎం అధినేత అసద్ కీలక వ్యాఖ్యలు చేసారు.
అసద్ స్పందన
హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్న అధికారులు ఆ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చివేస్తారా? అని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏంచేయబోతున్నారని ఆయన నిలదీశారు. ప్రభుత్వకార్యాలయాలను... నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా అంటూ సూటిగా ప్రశ్నించిన అసద్..నీటి కుంటలోనే కొన్ని కార్యాలయాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

వాటిని తొలిగిస్తారా
నెక్లెస్‌రోడ్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేదని వివరించారు. చాలా చోట్ల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు. చాలా చోట్ల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు. గోల్కొండలో కూడా గోల్ఫ్ కోర్టు ఉందన్నారు. ఆ గోల్ఫ్ కోర్టులో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడతారని చెప్పారు.ఎఫ్‌టీఎల్ సమస్యపై హైదరాబాద్ నగర మేయర్‌ని కలిసి చెప్పానన్నారు. ప్రభుత్వం నిర్ణయం ఏంటో చూడాలని వ్యాఖ్యానించారు.
ఆక్రమణలపై
నిబంధనలకు విరుద్ధంగా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని హైడ్రా స్పష్టం చేసింది. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఫంక్షన్ హాల్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయటంతో హైడ్రా గురించి చర్చ మొదలైంది. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలతో హైడ్రా ఈ చర్య తీసుకుంది. దీంతో, హైడ్రా తరువాతి రోజుల్లో తీసుకొనే చర్యల్లో ఎవరి నిర్మాణాల పైన గురి పెడుతుంది..ఏం చేయబోతోందనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications