వాళ్లకు సినిమా చూపిస్తాం - కేటీఆర్ : స్టీల్ బ్రిడ్జి ప్రారంభం, ఎన్నో ప్రత్యేకతలు..!!

హైదరాబాద్ లో స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. దక్షిణ భారత దేశంలోనే మొదటి పొడవైన స్టీల్‌ బ్రిడ్జ్‌ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి భూసేకరణ లేకుండానే ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం నామకరణం చేశారు. ఈ ప్రారంభోత్సవ వేళ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామన్నారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా : హైదరాబాద్ నగరంలో ప్రత్యేకమైన వంతెన ఆరంభమైంది. ఇందిరా పార్క్‌-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్‌ శనివారం ఉదయం ప్రారంభించారు. ఇందిరా పార్క్‌ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్‌ భవన్ సమీపంలోని VST చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. తద్వారా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అశోక్‌ నగర్‌, వీఎస్టీ జంక్షన్లలో ఏర్పడే ట్రాఫిక్‌ రద్దీ తగ్గనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Minister KTR launched Steel flyover between VST and Indira Park, Serious comments on Oppostion

హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన 36వ బ్రిడ్జిగా మంత్రి కేటీఆర్ దీనిని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొంత మంది మతం పేరుతో చిచ్చు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టటం ఖాయమన్నారు. ప్రతిపక్షాలకు 2023లోనే సినిమా చూపిస్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

స్టీల్ బ్రిడ్జికు ప్రత్యేకతలు : ఇక, తాజాగా ప్రారంభించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బ్రిడ్జి పొడవు 2.62 కిలోమీటర్లు.. వెడల్పు నాలుగు లైన్లుగా నిర్మాణం చేసారు. ఈ బ్రిడ్జి కోసం 12, 316 మెట్రిక్‌ టన్నుల ఉక్కు వినియోగించారు. 81 స్టీల్‌ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలు ఉపయోగించారు. దక్షిణ భారత దేశంలోనే మొదటి పొడవైన స్టీల్‌ బ్రిడ్జ్‌. తొలిసారి భూసేకరణ లేకుండానే ఈ బ్రిడ్జిని నిర్మించారు.

కాంక్రీట్‌ 60-100 ఏళ్లు, స్టీల్‌ 100 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. వంతెన నిర్మాణానికి దాదాపు 450కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. వంతెన అందుబాటులోకి రావడంతో వీఎస్‌టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

మరిన్ని ప్రారంభిస్తాం : ఎస్‌ఆర్‌డీపీలో 48 ప్రాజెక్టులు చేపట్టింది. ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులయ్యాయి. వాటిలో 19 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, 7 ఆర్వోబీ/ఆర్‌యూబీ, ఒక కేబుల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట రహదారి, ఓఆర్‌ఆర్‌ మెదక్‌ రోడ్‌ ఉంది. 20వ ఫ్లై ఓవర్‌గా ఈ స్టీల్‌ బ్రిడ్జి నిలవనుంది. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లొచ్చు. అంటే అరగంట జర్నీలో 25 నిమిషాల సమయం ఆదా కానుంది.

సికింద్రాబాద్‌, తార్నాక, ఓయూ, చర్లపల్లి, అంబర్‌పేట, రామంతపూర్‌, ఉప్పల్‌ మీదుగా వరంగల్‌ వైపు వెళ్లే వారికి ప్రయాణం సులభతరం అవుతుంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన మంత్రి కేటీఆర్.. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+