ఇప్పుడు కూడా రాజకీయమేనా?: హుస్సేన్‌సాగర్, మూసీ నది ఉధృతిని పరిశీలించిన కేటీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగరంలో వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయని.. దీంతో హుస్సేన్ సాగర్‌కు భారీగా వదర వచ్చి చేరుతోందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోన ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లో వరద పరిస్థితిని మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. మూసారాంబాగ్ వద్ద వరద పరిస్థితి, మూసీపై లో లెవల్ వంతెనను కేటీఆర్ పరిశీలించారు. ఇవాళ అసాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో నగరవాసులకు బీఆర్ఎస్ శ్రేణులు అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ministerktrreviewedthefloodsituation1

వర్షకాలం ప్రారంభానికి ముందే నాలాల్లో పూడిక తీశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. చెరువుల్లోనూ తక్కువ నీటిమట్టం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలని కేటీఆర్ ఆదేశించారు. పురపాలక ఉద్యోగులకు అన్ని సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో చేతనైతే ప్రతిపక్షాలు సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. వర్షాలను కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు మంత్రి కేటీఆర్. వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించామని, అవసరమైతే తాను శుక్రవారం స్వయంగా వెళ్లనున్నట్లు తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్‌ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో 14 బ్రిడ్జిలు మంజూరు చేశామన్నారు. మరోవైపు, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో భారీ వర్షాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలక శాఖ అధికారులతోనూ సీఎం ప్రత్యేకంగా మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. వర్షాల కారణంగా ప్రాణనష్టం జగరకుండా చూడటమే ప్రాథమిక ప్రాధాన్యతగా పనిచేయాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+