కవిత గురించి కేటీఆర్ ఆసక్తికర అంశాలు - సీట్లపై బాధగా ఉంది..!!
తమ కుటుంబం గురించి మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. తన సతీమణి చాలా ఓపికగా ఉంటారని చెప్పారు. చెల్లి కవిత డైనమిక్ గా చెప్పుకొచ్చారు. తన కుమార్తె చిన్న వయసులోనే చాలా బాగా ఆలోచిస్తుందన్నారు. పిల్లిద్దరినీ సమానంగా చూస్తానని చెప్పారు. కూతురు పుట్టాక తన జీవితం చాలా మారిందని కేటీఆర్ వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
సరైన సంఖ్యలో సీట్లు ఇవ్వలేదు : మహిళలతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. #womenAskKTR కార్యక్రమంలో పలు ప్రశ్నలకు ఆసక్తి కర సమాధానం ఇచ్చారు. తన తండ్రి ప్రజాజీవితంలో ఉండటంతో చిన్నతనంలో ఆయన ప్రభావం తనపైన తక్కువగా ఉండేదన్నారు. తమ తల్లిని చూసి చాలా నేర్చుకున్నామని చెప్పుకొచ్చారు.

తన తల్లి చాలా డైనమిక్ అని..కుటుంబంలో ఆమె అంత ధైర్యవంతురాలు అని వివరించారు. ప్రత్యర్ధులు డీప్ ఫేక్ వాడి తమ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను రష్మిక అంత ఫేమస్ కాదని కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు ఇవ్వలేదని, దీని పైన బాధగా ఉందని చెప్పుకొచ్చారు.
ప్రతిపక్షాలకు తెలుసు : తామే గెలుస్తామని ప్రతిపక్షాలకు కూడా తెలుసని..కానీ, వాళ్లు నటిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారని..అది తాము చేర్చుకోవాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని చెప్పారు.
ఉమ్మడి కుటుంబాల్లో మహిళలది ప్రధాన పాత్ర అని, ఉమ్మడి కుటుంబంలోనే తన చిన్నతనం గడిచిందని, తన జీవితంలో ఎంతోమంది స్ట్రాంగ్ ఉమెన్ లీడర్లను చూశానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సమాధానాలిచ్చారు. ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని చెప్పారు.

ఇక్కడ నుంచే రాణిస్తున్నారు : సానియా మీర్జా, సైనా నెహ్వాల్, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది మహిళలు హైదరాబాద్ నుంచి క్రీడల్లో రాణిస్తున్నారన్నారు.. శ్రీనిధి వంటి కార్యక్రమాలు మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నాయని వివరించారు. మ్యానిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించామని చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లో మహిళలు, గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామ్నారు. దీంతో దవాఖానల్లో డెలివరీల శాతం పెరిగిందన్నారు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి చిన్నారిపై రూ.10 వేలకుపైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ను మహిళలు సురక్షితంగా భావిస్తున్నారుని మంత్రి కేటీఆర్ వివరించారు.












Click it and Unblock the Notifications