ఖమ్మం - సూర్యాపేటతో తీవ్రంగా పోటీపడుతున్న మిర్యాలగూడ.. ఏది గెలుస్తుందో?

హైదరాబాద్ నుంచి చెన్నైకి హైస్పీడ్ రైలు మార్గం ప్రాజెక్ట్ ఎలైన్ మెంట్ మారుతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి రైల్వే హైదరాబాద్‌-శంషాబాద్‌- నార్కట్‌పల్లి- సూర్యాపేట- ఖమ్మం నుంచి ఏపీలో అమరావతి మీదుగా చెన్నైకి ప్రాజెక్టును ఖరారు చేసింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ ఎలైన్ మెంట్ మార్చాలని రైల్వే అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫోర్త్ సిటీ మీదుగా ఇది వెళ్లాలనేది సీఎం భావన.

ఫ్యూచర్ సిటీ నుంచి ఉండాలనేది సీఎం ఆలోచన
ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే రాబోతోంది. సర్వే పూర్తికాగానే 25వేల కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మార్గంపై కేవలం రెండు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోవచ్చు. దీనికి సమాంతరంగా హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ ఉండాలని రేవంత్ సూచించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అనుమతి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం శంషాబాద్‌ నుంచి మిర్యాలగూడ ప్రాంతం వైపుగా వెళ్లాలని కోరింది. ఖమ్మం, సూర్యాపేట కన్నా మిర్యాలగూడ, దాని చుట్టుపక్కల ప్రాంతాల మీదుగా హైస్పీడ్ రైలు కారిడార్ వెళితే అక్కడ భూములకు మార్కెట్ ధర పెరగడమే కాకుండా వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి. కొత్తగా సంపద సృష్టించినట్లవుతుంది.

Miryalaguda is competing fiercely with Khammam and Suryapet which one will win

చివరకు ఎవరు గెలుస్తారో?
ఖమ్మం, సూర్యాపేటకన్నా మిర్యాలగూడ, పరిసర ప్రాంతాలు కాస్తంత వెనకబడివున్నాయి. రైలు కారిడార్ తో ఇక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని సీఎం భావిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని అవుతుంది. అనుకోకుండా హైస్పీడ్ రైలు కారిడార్ రానుండటంతో చాలా తేలికగా అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నారు. ఖమ్మం నుంచి ఏలూరుకు సమీపంలోని దేవరపల్లి వరకు కొత్త హైవే అందుబాటులోకి రాబోతోంది. దీనివల్ల విశాఖపట్నం వెళ్లేవారికి 5 గంటల సమయం తగ్గుతుంది. దీంతో రైలు కారిడార్ ను అమరావతి గ్రీన్ ఫీల్డ్ పక్కనే నిర్మిస్తే ఉపయోగమని సీఎం భావిస్తున్నారు. అయితే ఖమ్మం-సూర్యాపేట మీదుగా వెళుతుందా? లేదంటే మిర్యాలగూడ మీదుగా వెళుతుందా తేలాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+