నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరవింద్.. చౌరస్తాలో చెప్పుతో కొడతా : షిండే తరహా లో బీజేపీ ఆఫర్ చేసింది - కవిత సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. బీజేపీ ఎంపీ అర్వింద్ పైన మండిపడ్డారు. హెచ్చరికలు చేసారు. ఎక్కడకు వెళ్లినా వెంట పడి ఓడిస్తానని శపథం చేసారు. తన గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే. అర్వింద్.. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యక్తి గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని..ఆయనది సంకుచిత మనస్తత్వమని..చిల్లర మాటలని ఫైర్ అయ్యారు. కేసీఆర్ గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

 చెప్పుతో కొడతానంటూ వార్నింగ్

చెప్పుతో కొడతానంటూ వార్నింగ్

అర్వింద్ అనుకోకుండా ఎంపీ గా అయ్యారన్నారు.186 మంది అభ్యర్థులను నిజామాబాద్‌లో బరిలో దింపారని వివరించారు. అటువంటి వ్యక్తి నిజామాబాద్ ఎంపీగా ఉండటం దురదృష్టకరమన్నారు. పార్లమెంటులో అరవింద్ పనితనం సున్నా అని ఎద్దేవా చేసారు. పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేశారని మండిపడ్డారు. అరవింద్‌ది ఫేక్ డిగ్రీ అని చెప్పిన కవిత.. దీనిపై నేను రాజస్థాన్ యూనివర్సిటీ కి పిర్యాదు చేస్తానన్నారు. అరవింద్ బురదలాంటోడని..ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు.

 షిండే మోడల్.. బీజేపీలో చేరమన్నారు

షిండే మోడల్.. బీజేపీలో చేరమన్నారు


నిన్న ప్రెస్ మీట్లో నీచంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. అరవింద్ భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అని బాధేస్తుందన్నారు. తాను సమస్యల మీద మాట్లాడతానని.. వ్యక్తుల మీద ఎపుడూ మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. కానీ అరవింద్ తీరు చూసి మాట్లాడక తప్పడం లేదన్నారు. కుక్క కాటు కు చెప్పు దెబ్బ తప్పదని హెచ్చరించారు. తనతో ఆ మాట అనిపించుకునే పరిస్థితి అరవింద్ తెచ్చుకున్నారన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు తాను ఖర్గేతో మాట్లాడాను అనేది శుద్ధ తప్పని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ వాసన లేని పార్టీల్లో తానెలా చేరుతానని ప్రశ్నించారు. తన జీవితం తాను నమ్మే ఏకైక నాయకుడు కేసీఆర్‌తోనే అని స్పష్టం చేసారు. తనరాజకీయ ప్రయాణం కేసీఆర్‌తోనే అని తేల్చి చెప్పారు.

కేసీఆర్ తోనే ఉంటా.. భయపడేది లేదు

కేసీఆర్ తోనే ఉంటా.. భయపడేది లేదు


తనకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని కవిత వెల్లడించారు. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడం పై మాట్లాడారని వివరించారు. తెలంగాణ లో షిండే మోడల్ నడవదని కవిత తేల్చి చెప్పారు. .జై మోడీ అన్న వారి పైన ఈడీ దాడులు ఉండవన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ..మోదీ అల్లుళ్లని లాలు చెప్పిన విషయాన్ని కవిత గుర్తు చేసారు. తాము ఈడీ దాడులకు భయపడమని.. జాతీయ రాజకీయాల్లోకి కచ్చితంగా వెళతామని తేల్చి చెప్పారు. అరవింద్‌కు కాంగ్రెస్ నేతలతో ఏం పని అంటూ ప్రశ్నించారు. బీజేపీలో ఉంటూ కాంగ్రెస్‌కు పని చేస్తున్నారా అని నిలదీసారు. నిజామాబాద్ లో కాంగ్రెస్‌తో కుమ్మకై తన మీద గెలిచారని కవిత మండిపడ్డారు.

English summary
MLC Kavitha Serious warning for BJP MP Aravaind, ,says shes got an offer from BJP just like shinde
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X