రేవంత్ కి తీన్మార్ మల్లన్న సవాల్ - బీజేపీకి మద్దతు..!!
ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేసారు. బీజేపీ కి సపోర్ట్ చేస్తూ రేవంత్ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందో రేవంత్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రేవంత్ చేసిన కులగణన సర్వే తప్పు అని తాను నిరూపిస్తానని.. చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేసారు.
రేవంత్ లక్ష్యంగా
కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న తన వాయిస్ పెంచారు. రేవంత్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ నుంచి పంపించడం ద్వారా బీసీ ఉద్యమం ఆగిపోతుందని రేవంత్ రెడ్డి భావించారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమం మామూలుది కాదని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. కులగణన తప్పుల తడకగా పేర్కొన్నారు. ఇప్పటికీ సర్వే విష యం లో ముఖ్యమంత్రికే చిత్తశుద్ది లేదని విమర్శించారు. అగ్రకులాలను ఎక్కువ చేసి చూపించారని ఆరోపించారు. కేవలం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి ఈ సర్వేను ఉపయోగించుకోవా లని చూస్తున్నారని మల్లన్న ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

రేవంత్ కు సవాల్
దాదాపు 90 ఏళ్ల తరువాత సర్వే చేస్తే ఒక్కరూ కూడా పాలాభిషేకం చేయలేదన్నారు. సర్వే విషయం లో రేవంత్ చర్చకు సిద్దమైతే ఎక్కడ తప్పు జరిగిందో నిరూపిస్తానంటూ తీన్మార్ మల్లన్న సవాల్ చేశారు. రేవంత్ ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు, ఆయన ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. ఏదైనా పనిచేస్తే తరతరాలు గుర్తించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి పేరు క్యాబినెట్ మంత్రులకు కూడా గుర్తుండటం లేదంటూ తీన్మార్ మల్లన్న ఎద్దేవా చేసారు. అన్యాయం జరిగితే గొంతెత్తాలని రాహుల్ చెబితే.. మీరు చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహ రిస్తున్నారని ధ్వజమెత్తారు.
బీజేపీ కోసమే
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తాను కూడా కారణమని చెప్పారు. 2028లో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటూ మల్లన్న చెప్పుకొచ్చారు. నోటీసులకు తాను భయపడనని తేల్చి చెప్పారు.
రేవంత్ సొంత పార్లమెంట్ లో పార్టీ గెలవలేదన్నారు. గ్రామగ్రామానికి బీసీ వాదాన్ని తీసుకెళ్తానని ప్రకటించారు. సీఎం రేవంత్ బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, చెవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. వంశీ చంద్‌రెడ్డి అధిష్టానికి దగ్గరగా ఉంటాడని, ఇక్కడి విషయాలు ఎప్పటికప్పుడు అక్కడికి చేరవేస్తాడనే ఉద్దేశం తోనే ఆయనను రేవంత్ ఓడించారని వ్యాఖ్యానించారు. బీసీల కోసం తన పోరాటం కొనసాగుతుంద ని తీన్మార్ మల్లన్న స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications