Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రాణహాని.. మంచు మనోజ్, మౌనికపై మోహన్ బాబు ఫిర్యాదు

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంచు మనోజ్‌పై జరిగిన దాడి ఘటనతో పోలీస్ స్టేషన్ వరకు ఈ వ్యవహారం వెళ్లింది. ఏకంగా కుమారుడిపైనే మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. మనోజ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ.. మోహన్ బాబుపై కాకుండా.. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ ఆయన ఫిర్యాదు చేశారు.

తన కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj), అతడి భార్య మౌనికపై మోహన్ బాబు రాచకొండ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో ఆయన పోలీసులను కోరారు. అసాంఘిక శక్తులుగా మారిన కొందరి నుంచి రక్షణ కల్పించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Mohan Babu files complaint against Manchu Manoj and Mounika for threatening life

'నేను జల్‌పల్లిలో పదేళ్లుగా నివసిస్తున్నా. నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు ఇల్లు వదిలి వెళ్లాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకలతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. మనోజ్ తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్‌లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు అక్రమంగా చొరబడి సిబ్బందిని బెదిరించారు. మనోజ్, మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకుని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తు విషయంలో భయపడుతున్నాను' అని మోహన్ బాబు తెలిపారు.

అంతేగాక, తనకు హాని కలిగించే ఉద్దేశంతో వారున్నారని మోహన్ బాబు చెప్పారు. నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయాలని బెదిరించారు. సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు. చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వారిద్దరూ ప్రాన్ వేశారు. నేను 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్‌ని. మనోజ్, మౌనిక, అతడి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి. నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించండి' అని రాచకొండ సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో మోహన్ బాబు కోరారు.

మంచు మనోజ్ ఫిర్యాదు

తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు సోమవారం సాయంత్రం వెళ్లిన మనోజ్.. తనపై దాడి జరిగిందని తెలిపారు. జల్‌పల్లిలోని ఇంట్లోనే తనతోపాటు తన భార్యపై తండ్రి మోహన్ బాబు సమక్షంలోనే విద్యానికేతన్ స్కూల్స్ పర్యవేక్షిస్తున్న వినయ్ అనే వ్యక్తి దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేశారు.

తనపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డానంటూ.. ఆస్పత్రి రిపోర్టులను కూడా పోలీసులకు అందజేశారు మంచు మనోజ్. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారి వివరాలను పోలీసులకు అందించినట్లు తెలిసింది. కాగా, అటు మోహన్ బాబు, ఇటు మంచు మనోజ్ ఫిర్యాదులతో మంచు కుటుంబ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+