టిడిపికి చుక్కలు చూపించాం: కవిత, ఒకే వేదికపై అన్నాచెల్లెళ్లు
ఆర్మూర్: తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో చుక్కలు చూపించామని, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతు చేశామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం అన్నారు. ఆర్మూర్‌లో జనహిత బహిరంగ సభ జరిగింది. ఒకే వేదికపై అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత కనిపించారు. ఈ సభలో కవిత మాట్లాడారు.
అమ్మ ఆత్మీయత, నాన్న బాధ్యత కలిస్తేనే 'అన్నయ్య' అని కవిత అన్నారు. కేటీఆర్ లాంటి అన్నయ్య ఉన్నందుకు తాను ఎంతగానో గర్విస్తున్నానని చెప్పారు. కేటీఆర్ రాష్ట్రంలోని చెల్లెళ్లందరికీ అన్నయ్య అని చెప్పారు.

తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపామని చెప్పారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని భయాందోళన సృష్టించారని, కానీ ఆ వాదనలు అబద్దమని నిరూపించామన్నారు.












Click it and Unblock the Notifications