నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రామాల్లో బస, రాత్రిపూటా పర్యటించి సమస్యలు తెసుకున్న కవిత(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బోధన్ నియోజక వర్గం లోని పలు గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు.

కవిత గ్రామాల అభివృద్ది నినాదంతో కొనసాగిస్తున్న‘మన ఊరు-మన ఎంపీ'లో భాగంగా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నవీపేట్ మండలం లోని బినోల, నాళేశ్వర్ గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించి అక్కడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం నిర్వహించిన గ్రామ సభల్లో కూడా స్థానిక సమస్యలను ఎంపీ కవిత దృష్టికి తెచ్చారు. వాటన్నిటికి సంబందిత అధికారులతో అక్కడే మాట్లాడారు కవిత. ఈ కార్యక్రమం అనంతరం నాళేశ్వరం గ్రామంలోనే కవిత బస చేశారు. నియోజకవర్గంలో ‘మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమం 6వ తేదీ నుంచి 8 వరకు మూడు రోజులు కొనసాగనుంది. బినోల గ్రామంలోని కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే శ్రీ షకీల్ అహ్మద్ కూడా పాల్గొన్నారు.

నాళేశ్వరం గ్రామంలోని కార్యక్రమంలో భాగంగా గ్రామం మొత్తం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక సమస్యల్ని గ్రామస్తులు ఎంపి కవిత దృష్టికి తెచ్చారు. ఇందులో భాగంగా గ్రామ సమస్యలతో పాటు, వ్యక్తిగతంగా అందవలసిన ప్రభుత్వ పథకాల గురించి వారు ఎంపీకి విన్నవించారు. వీటన్నింటిపై చివరలో మాట్లాడిన ఎంపీ కవిత అనేక అంశాలపై ప్రభుత్వ అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కరించారు.

నాళేశ్వర్‌లో యువకులు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న గ్రాంథాలయాన్ని పాదయాత్రలో భాగంగా కవిత దర్శించారు. చదువుకున్న యువకులు పూనుకుంటే ఊరు బాగుపడడం కష్టం కాదనడానికి ఇది తార్కాణమని అన్నారు. ఈ గ్రంథాలయానికి తప్పకుండా నిధులు మంజూరయ్యేలా చూస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. నాళేశ్వర్లో రాత్రి 9 వరకు జరిగిన కార్యక్రమంలో గ్రామ సమస్యలపై, తీసుకోవాల్సిన చర్యలపై కవిత మాట్లాడారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బోధన్ నియోజక వర్గం లోని పలు గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

కవిత గ్రామాల అభివృద్ది నినాదంతో కొనసాగిస్తున్న‘మన ఊరు-మన ఎంపీ'లో భాగంగా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నవీపేట్ మండలం లోని బినోల, నాళేశ్వర్ గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించి అక్కడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

అనంతరం నిర్వహించిన గ్రామ సభల్లో కూడా స్థానిక సమస్యలను ఎంపీ కవిత దృష్టికి తెచ్చారు. వాటన్నిటికి సంబందిత అధికారులతో అక్కడే మాట్లాడారు కవిత. ఈ కార్యక్రమం అనంతరం నాళేశ్వరం గ్రామంలోనే కవిత బస చేశారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

నియోజకవర్గంలో ‘మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమం 6వ తేదీ నుంచి 8 వరకు మూడు రోజులు కొనసాగనుంది. బినోల గ్రామంలోని కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే శ్రీ షకీల్ అహ్మద్ కూడా పాల్గొన్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

బినోల గ్రామంలో పాదయాత్ర నిర్వహించిన ఎంపీ కల్వకుంట్ల కవిత గ్రామస్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

గ్రామంలో ఉన్న నీటి కొరత సమస్యను ప్రధానంగా ఎంపీ కవిత దృష్టికి తెచ్చారు. స్పందించిన కవిత త్వరలోనే అది తీరుస్తానని చెప్పారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

అదేవిధంగా బైపాస్ రోడ్ అవసరాన్ని కూడా గ్రామస్తులు కవిత గారి దృష్టికి తెచ్చారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

ఇది ఖర్చుతో కూడుకున్నది ఐనప్పటికి అధికారులతో మాట్లాడి త్వరగా జరిగేలా చూస్తానని కవిత అన్నారు. అదే విధంగా గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

నాళేశ్వరం గ్రామంలోని కార్యక్రమంలో భాగంగా గ్రామం మొత్తం పాదయాత్రలో పాల్గొన్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

ఈ సందర్భంగా అనేక సమస్యల్ని గ్రామస్తులు ఎంపి కవిత దృష్టికి తెచ్చారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

ఇందులో భాగంగా గ్రామ సమస్యలతో పాటు, వ్యక్తిగతంగా అందవలసిన ప్రభుత్వ పథకాల గురించి వారు ఎంపీకి విన్నవించారు. వీటన్నింటిపై చివరలో మాట్లాడిన ఎంపీ కవిత అనేక అంశాలపై ప్రభుత్వ అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కరించారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

వివిధ ప్రభుత్వ పథకాలు, పెన్షన్ల విషయమై వచ్చిన ఫిర్యాదుల విషయమై కూడా అధికారులతో మాట్లాడించారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

గతంతో పోలిస్తే ఇప్పటికి పెరిగిన పెన్షన్ల డబ్బులపై కూడా ప్రజలు కవిత వద్ద హర్షం వ్యక్తం చేశారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

జోగినీ పెన్షన్ల పై కొందరు అడిగిన ప్రశ్నలకు జవాబుగా గతంలో జోగినీలను వితంతువుగా పరిగణించి పెన్షన్ ఇచ్చేవారని, అలా కాకుండా జోగినీలకే ప్రత్యక్షంగా పెన్షన్ ఇచ్చేలా తమ ప్రభుత్వం కార్యాచరణ జరుపుతుందని, త్వరలోనే పరిష్కారమవుతుందని కవిత తెలిపారు.

English summary
MP Kavitha visited villages in Nizamabad districts on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X