మంత్రివర్గ విస్తరణ పై ఊహించని నిర్ణయం - వారికే ఛాన్స్..!!
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు. విస్తరణ ఖాయమైన వేళ అనూహ్య పరిణామాలు తెర మీద కు వస్తున్నాయి. పార్టీ అధినాయకత్వం తుది జాబితా ఖరారులో కొత్త ట్విస్ట్ లు ఇస్తోంది. ఇప్పటికే నలుగురి పేర్లు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. కాగా, అందులో ఇద్దరి పేర్ల పైన పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో ఢిల్లీలో మకాం వేసిన టీపీసీసీ నేతలు హైకమాండ్ తో విస్తరణ అంశం పైన చర్చించారు. దీంతో.. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ వేళ ఊహించని విధంగా కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.
రాహుల్ సూచనలతో
తెలంగాణ లో సుదీర్ఘ నిరీక్షణ తరువాత మంత్రివర్గ విస్తరణ కు పార్టీ అధినాయకత్వం ఆమోదం తెలిపింది. ఆరు స్థానాలు ఖాళీ ఉండగా.. అయిదుగురితో తొలుత భర్తీ చేయాలని నిర్ణయించింది. నలుగురి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. సుదర్శనరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి, వివేక్ పేర్లు ఖాయమైనట్లు ప్రచారం జరిగింది. కాగా, రాహుల్ గాంధీ ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు పైన ప్రశ్నించినట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండగా.. రాజగోపాల్ రెడ్డి కి అవకాశం ఇవ్వటం ఏంటనేది రాహుల్ ప్రశ్న. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీల మేరకు వారిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు స్పష్టం చేసారు.
తేల్చేసిన టీపీసీసీ చీఫ్
అయితే, తాము చర్చించి నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని రాహుల్ పార్టీ రాష్ట్ర నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో, తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రివర్గ విస్తరణ పైన అసలు విషయం బయట పెట్టారు. మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని స్పష్టం చేసారు. రాష్ట్రం నుంచి పార్టీలోని అందరి అభిప్రాయాలు తీసుకున్నారని వెల్లడించారు. పార్టీలో వచ్చిన ఇబ్బందులు తొలిగిన తరువాత అధినాయకత్వం విస్తరణ పైన నిర్ణయం తీసుకుంటుంద ని చెప్పుకొచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు పూర్తిగా హైకమాండ్ పరిధిలోని అంశంగా మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ప్రాంతాలు - సామాజిక సమీకరణాల ఆధారంగా పార్టీ నాయకత్వం విస్తరణ పైన తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

వీరికి బెర్తులు ఖాయం
ఇప్పటికే నలుగురు పేర్లు మంత్రులుగా ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. కాగా, రాజగోపాల్ రెడ్డి పేరు విషయంలో రాహుల్ గాంధీ ప్రస్తావనతో ఇప్పుడు ఆయనకు చివరి నిమిషంలో అవకాశం దక్కుతుందా లేదా అనేది సస్పెన్స్ గా మారుతోంది. రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ లేకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మరో ముఖ్య నేత పేరు లిస్టులో చేరే అవకాశం ఉంది. అదే విధంగా ఈ సారి విస్తరణ లో మైనార్టీ వర్గానికి ఖాయమని తెలుస్తోంది. జానారెడ్డి లేఖతో ఉమ్మడి రంగారెడ్డి - హైదరా బాద్ నేతలకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఇద్దరు బీసీల కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీంతో, మంత్రివర్గ విస్తరణ.. బెర్తుల ఖరారు పైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications