కొత్త ఆదాయపు పన్ను: ఉద్యోగులకు ఊరట, వాహనాల భీమా ప్రీమియం పైపైకి

కొత్త ఆదాయపు పన్ను ధరలు ఏప్రిల్ 1వ, తేది నుండి అమల్లోకి వచ్చాయి.కొత్త పన్ను ప్రకారంగా ఉద్యోగులకు ఐటీ రిటర్న్స్ లో కొంత లాభం కలగనుంది. వాహనాల ప్రీమియం ధరలు పెరగనున్నాయి.రిటర్న్ లు దాఖలు చేసేందుకు ఆధార్

హైదరాబాద్:కొత్త ఆదాయపు పన్ను ధరలు ఏప్రిల్ 1వ, తేది నుండి అమల్లోకి వచ్చాయి.కొత్త పన్ను ప్రకారంగా ఉద్యోగులకు ఐటీ రిటర్న్స్ లో కొంత లాభం కలగనుంది. వాహనాల ప్రీమియం ధరలు పెరగనున్నాయి.రిటర్న్ లు దాఖలు చేసేందుకు ఆధార్ ను తప్పనిసరి చేశారు.

కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను రేట్లను ఏప్రిల్ 1వ, తేది నుండి అమల్లోకి తీసుకువచ్చింది. ఇటీవలే పార్లమెంట్ ఆర్థికబిల్లుకు ఆమోదం తెలిపింది.

ఐటీ స్లాబ్ లలో మార్పులనను కేంద్రం ఫిబ్రవరిలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. దానికి సవరణలను మార్చి చివరినాటికి పూర్తి చేసి ఆమోదింపజేసేలా కేంద్రం చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

కొత్త ఆదాయపు పన్ను రేట్ల ప్రకారంగా ఉద్యోగులకు కాస్త ఊరట లభించనుంది. ఉద్యోగుల ఆర్థిక వ్యవహరాల్లో మార్పులు సంభవించనున్నాయి. అయితే వాహానాల భీమా ప్రీమియాన్ని మాత్రం భారీగా పెరగనున్నాయి.

ఉద్యోగుల పన్ను పది నుండి ఐదు శాతానికి తగ్గింపు

ఉద్యోగుల పన్ను పది నుండి ఐదు శాతానికి తగ్గింపు

ఉద్యోగులపై ఆదాయ పన్ను రేటును కేంద్రం సగానికి సగం తగ్గించింది. పది శాతం నుండి ఐదుశాతానికి పన్ను రేటును తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.దీని వల్ల ఏటా రూ.12,500 కోట్ల వరకు ఆదా అవుతోంది.ఉద్యోగుల సంవత్సర ఆదాయం రెండున్నర లక్షల నుండి ఐదు లక్షల వరకు ఈ తగ్గింపును అమలు చేయనుంది కేంద్రం.

ఐదు లక్షలపైన ఆదాయం ఉన్నవారికి కూడ తగ్గింపే

ఐదు లక్షలపైన ఆదాయం ఉన్నవారికి కూడ తగ్గింపే

ఐదు లక్షల నుండి రూ.5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి ఏటా రూ.12,900 పన్ను ఆదా అవుతోంది. ఇక వార్షిక ఆదాయం కోటి కన్న ఎక్కువ ఉన్నవారికి సైతం సర్ ఛార్జీ, సెస్సులు సహా రూ.14,806 మేర పన్ను తగ్గుతోంది.ఉద్యోగులపై కేంద్రం కనికరం చూపింది.

ఐటీ రిటర్న్స్ కోసం సులభ పద్దతులు

ఐటీ రిటర్న్స్ కోసం సులభ పద్దతులు

ఐదు లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి సరళమైన ఒక పేజీ ఫామ్ ను ప్రవేశపెట్టారు.ఈ కేటగిరిలో తొలిసారిగా టాక్స్ ను దాఖలు చేసే వారిని ఐటీ నిఘా విభాగం తనిఖీ చేయదు.

ఈ ఆర్థిక సంవత్సరం ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడంలో జాప్యం జరిగితే 2018 డిసెంబర్ 31వ, తేదిలోపుగా దాఖలు చేస్తే రూ.ఐదు వేలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.ఆ తేది కూడ దాటితే జరిమానా ఇంకా ఎక్కువ ఉంటుంది.అయితే ఐదు లక్ష వరకు ఆదాయం ఉనన్ చిన్న పన్ను చెల్లింపుదారులకు ఈ జరిమానాను వెయ్యి రూపాయాలకే పరిమితం చేశారు.

స్థిరాస్థి దీర్ఘకాల హోల్డింగ్ కాలపరిమితి 2 ఏళ్ళకు తగ్గింపు

స్థిరాస్థి దీర్ఘకాల హోల్డింగ్ కాలపరిమితి 2 ఏళ్ళకు తగ్గింపు

స్థిరాస్తి దీర్ఘకాల హెల్డింగ్ కాలపరిమితిని మూడేళ్ళ నుండి రెండేళ్ళకు తగ్గించారు. రెండేళ్ళకు పైగా హొల్డింగ్ లో ఉన్న స్థిరాస్థిపై పన్ను 20 శాతానికి తగ్గుతోంది. రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీమ్ లో పెట్టుబడులకు 2018-19 నుండి పన్నుమినహయింపు లభించదు.

ఐటీ రిటర్స్న్ కు ఆధార్ తప్పనిసరి

ఐటీ రిటర్స్న్ కు ఆధార్ తప్పనిసరి

ఈ ఏడాది జూలై నుండి పాన్ కోసం ధరఖాస్తు చేసేటప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్ లు దాఖలు చేసేప్పుడు ఆధార్ తప్పనిసరి చేసింది.నగదు లావాదేవీలను మూడు లక్షల నుండి రెండు లక్షల వరకే పరిమితం చేసింది కేంద్రం.

వాహనాల ప్రీమియం ధరలు భారీగా పెరగనున్నాయి

వాహనాల ప్రీమియం ధరలు భారీగా పెరగనున్నాయి

ఈ ఆర్థిక సంవత్సరం నుండి మోటార్ సైకిళ్ళు, వాహనాల భీమా ప్రీమియంలు భారీగా పెరగనున్నాయి.

ఏజెంట్ల కమిషన్ ను భీమా సంస్థలు సవరించడానికి భీమా నియంత్రణ సంస్థ అనుమతివ్వడం దీనికి కారణం. ప్రస్తుతమున్న భీమా రేట్లకు ఐదు శాతం ఎక్కువ లేదా తక్కువకు పరిమితం చేయనున్నారు.అలాగే థర్ట్ పార్టీ భీమా రేట్లు కూడ పెరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+