మహిళకు అసభ్యకర వాట్సాప్: సీఐడీ ఇన్స్‌పెక్టర్‌పై నిర్భయ కేసు
కరీంనగరం: సిఐడీ ఇన్‌స్పెక్టర్ దయాకర్ రెడ్డి పైన నిర్భయ కేసు నమోదైంది. మాజీ ఏఎస్సై మోహన్ రెడ్డి కేసులో విచారణ అధికారిగా ఉన్న దయాకర్ రెడ్డి కరీంనగర్‌లోని శ్రీనగర్ కాలనీలో ఓ మహిళను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఓ మహిళకు దయాకర్ రెడ్డి వాట్సాప్, ఫోన్ల ద్వారా అసభ్యకర సందేశాలు పంపించారని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. కేసులో భాగంగా విచారించాల్సిన మహిళా ఉద్యోగికి వాట్సాప్‌లో అతను అసభ్యకర సందేశాలు పంపి అడ్డంగా దొరికిపోయాడని తెలుస్తోంది.

దయాకర్ రెడ్డి పైన కరీంనగర్ టూటౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. కరీంనగర్లో పని చేస్తూ అక్రమ వడ్డీ వ్యాపారంలో ఇర్కుకున్న ఏఎస్సై మోహన్ రెడ్డి కేసును ప్రభుత్వం సీఐడీకి అఫ్పగించిన విషయం తెలిసిందే.
కేసులో భాగంగా ఓ మహిళా ఉద్యోగినిని విచారించాల్సి వచ్చింది. దయాకర్ రెడ్డి ఆమెను విచారిస్తున్నారు. అనంతరం ఆమెకు వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపించాడు. వీటిని ఆమె పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు రూపంలో పంపించారు.












Click it and Unblock the Notifications