లోక్‌సభలో రేవంత్ వర్సెస్ నిర్మలా సీతారామన్: షాకింగ్ వ్యాఖ్యలు, స్పీకర్ మందలింపు
న్యూఢిల్లీ: పార్లమెంటులో కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే చోటు చేసుకుంది. బలహీనమైన హిందీ అంటూ రేవంత్ రెడ్డి వాడిన భాషనుద్దేశించి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తాను శూద్రుడినంటూ తన భాష ఇలాగే ఉంటుందని.. నిర్మల బ్రాహ్మణులని వారి భాష బాగుంటుందని వ్యాఖ్యానించారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకుని అలాంటి పదాలు ఉపయోగించవద్దని వారించారు.

రేవంత్ హిందీ బలహీనమైనా.. మాట్లాడనివ్వాలన్న అధిర్
ఆ వివరాల్లోకి వెళితే సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి హిందీలో మాట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. డాలర్ కు రూపాయి మారకం తీవ్రంగా పతనమైందన్నారు. మోడీ సీఎంగా ఉన్నప్పుడు డాలర్ రూపాయి మారకం 66 ఉండగానే ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించారని.. ఇప్పుడు అది 80 రూపాయలకు చేరుకుందని ధ్వజమెత్తారు. అయితే, స్పీకర్ ఓంబిర్లా ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో మీరు నన్ను అడ్డుకోకూడదు అంటూ రేవంత్ హిందీలో అనడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ను ఉద్దేశించి అలా వ్యాఖ్యానించడానికి వీళ్లేదని మీ సభ్యులకు చెప్పండి అంటూ కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి సూచించారు. దీంతో రేవంత్ హిందీ కాస్త బలహీనంగా ఉండొచ్చు కానీ.. ఆయనను మాట్లాడటానికి విజ్ఞప్తి చేస్తున్నందున అనుమతించాలని చౌదరి స్పీకర్ ను కోరారు.

రేవంత్‌కు బలహీన హిందీలోనే బదులిస్తానంటూ నిర్మలా సీతారామన్
ఈ క్రమంలో రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం డాలర్ మారకం విలువ రూ. 83.20కి పడిపోయిందన్నారు. ఐసీయూకి చేరిన రూపాయిని ఇంటికి తీసుకురావడానికి ఏం చేస్తున్నారన్నది తన ప్రశ్న అని రేవంత్ ముగించారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ స్పందించారు. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్లు తమ హిందీ బలహనీంగా ఉందని చెబుతున్నారు. నా హిందీ కూడా బలహీనంగా ఉంది. అందువల్ల బలహీనమైన హిందీకి బలహీనమైన హిందీలోనే సమాధానమిస్తున్నాను అని నిర్మల చెప్పారు. తన సమాధానం పూర్తి చేశారు నిర్మలా సీతారామన్. రూపాయి విలువ కాదు.. ప్రపంచంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నా.. భారత్ మాత్రం స్థిరంగా బలంగా ఉందని వివరించారు.

రేవంత్ షాకింగ్ వ్యాఖ్యలు.. స్పీకర్ మందలింపు
అనంతరం రేవంత్ మరోసారి మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి తన భాష గురించి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తాను శూద్రుడినని.. అందువల్ల తన భాష స్వచ్ఛ హిందీ గా లేదన్నారు. నిర్మలా సీతారామన్ బ్రాహ్మణవాది కనుక ఆమెకు మంచి భాష వచ్చని అన్నారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అభ్యంతరం తెలిపారు. తాము ఫలానా జాతి, మతం నుంచి వచ్చామని సభ్యులెవరూ వ్యాఖ్యానించకూడదని ఈ సందర్భంగా స్పీకర్ హితవు పలికారు. అలా మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications