ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు: కోదండరామ్
మెదక్ : ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు జెఎసి చైర్మెన్ కోదండరామ్ ,ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలను ఆయన ఖండించారు.
మంగళవారంనాడు ఆయన మెదక్ లో మీడియాతో మాట్లాడారు.తన వెనుక ఎవరూ లేరన్నారు. రైతు ప్రయోజనాల కోసమే తాను దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ప్రభుత్వమే మంచి చెడులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

సాటి మనిషిగా స్పందిస్తున్నానని చెప్పారు.తాను చేసే కార్యక్రమాల్లో తప్పులుంటే సరిదిద్దుకొంటానని ఆయన చెప్పారు.రాజకీయ చర్చల్లో కూడ తనపై దాడి చేసే సంస్కృతి సరికాదన్నారాయన.రైతు దీక్ష పై ప్రభుత్వం విమర్శలు చేయడం సరికాదన్నారాయన.
రైతు దీక్షకు దిగితే కాంగ్రెస్ పార్టీ ఎజెండాను అమలు చేస్తున్నానని చెప్పడం సరైంది కాదన్నారాయన. తనపై ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.












Click it and Unblock the Notifications