పెళ్ళైన మూడేళ్ళకే భర్త మృతి, డ్రైవర్‌తో సహజీవనం, ట్విస్టిచ్చిన లవర్, సూసైడ్
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న ప్రియుడు పెళ్ళికి అంగీకరించకపోవడంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైద్రాబాద్ సైదాబాద్‌లోని బాలాజీనగర్ లో చోటు చేసుకొంది. మృతురాలి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.
హైద్రాబాద్ నగరంలోని సైదాబాద్ డివిజన్ లోని బాలాజీనగర్ లో ఓ మహిళ తన కూతురితో కలిసి నివాసం ఉంటుంది. కూతురుకు చిన్నప్పుడే గుండె సంబంధమైన వ్యాధితో ఇబ్బందిపడుతోంది.
ఆమెకు 1997లో నర్సింగరావు అనే వ్యక్తితో వివాహమైంది. అయితే వివాహమైన మూడేళ్ళకే భర్త చనిపోయాడు. కూతురితో కలిసి ఆమె నివాసం ఉంటుంది. అయితే జీవనోపాధి కోసం ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.

భర్త మరణించాక డ్రైవర్ తో సహాజీవనం
పెళ్ళైన మూడేళ్ళకే ఆ వివాహితకు భర్త మరణించాడు. దీంతో కూతురితో కలిసి ఆమె బాలాజీనగర్ లో నివాసం ఉంటుంది. ఈ సమయంలో కారుడ్రైవర్ శ్రవణ్‌కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వీరిద్దరూ సహజీవనం చేసే వరకు వెళ్ళింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఆమె ఆసుపత్రిలో నర్స్ గా పనిచేస్తోంది.

పెళ్ళి కోసం శ్రవణ్‌తో వాగ్వాదం
శ్రవణ్ తో సహాజీవనం చేస్తున్న నర్సు తనను పెళ్ళి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే తన చెళ్ళెళ్ళ పెళ్ళిళ్ళు పూర్తైన తర్వాత వివాహం చేసుకొందామని ఆమెను నమ్మించాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం కూడ చోలు చేసుకొందని పోలీసులు చెబుతున్నారు.

ఉరేసుకొని ఆత్మహత్య
అయితే మే 23వ తేది కూడ మరోసారి పెళ్ళి విషయమై శ్రవణ్ తో ఆమె గొడవ పడిందని సమాచారం. అయితే ఈ విషయమై ఆమెకు ఏదో నచ్చజెప్పి శ్రవణ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. అయితే అతను మరో పెళ్ళి చేసుకొనేందుకు సిద్దమయ్యాడని నర్సు అనుమానించింది. ఈ విషయమై పలుమార్లు శ్రవణ్ కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొందని పోలీసులు చెబుతున్నారు.

శ్రవణ్ పై కేసు నమోదు
మధ్యాహ్నం ఇంటికి వచ్చిన శ్రవణ్ తలుపు కొట్టినా నర్సు తలుపుతీయలేదు. ఈ విషయమై ఆమె సోదరుడికి సమాచారాన్ని ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి తలుపులు పగులగొట్టి చూసే సరికి ఆమె ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయింది. దీంతో మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications