ఒడిశా ఎన్ కౌంటర్ లో మృతిచెందిన గణేష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసి. గణేష్ ది భూపాలపల్లి వాడే.
జయశంకర్ భూపాలపల్లి : ఒడిశాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతించెందిన మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన గాజర్ల గణేష్ అలియాస్ ఉదయ్ అలియాస్ రవి కూడ ఉన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో 23 మంది మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. 1990 నుండి అజ్ఘాతంలో ఉన్నాడు. ఇవాళ తెల్లవారుఝామున ఒడిశాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరనించాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గాజర్ల రవి స్వగ్రామం వెలిశాల. ప్రస్తుతం ఈ గ్రామం టేకుమట్ల మండలంలో ఉంది. టేకుమట్ల కొత్తగా ఏర్పడిన మండలం.ఇతని సోదరుడు ఆశోక్ కూడ మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నాడు. ఆశోక్ అడుగు జాడల్లోనే రవి కూడ నడిచాడు.1990 నుండి ఆయన నక్సల్స్ ఉద్యమంలో పనిచేస్తున్నారు.మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా రవి ఎదిగాడు ప్రస్తుతం ఉదయ్ ఆంద్రా ఒడిశా సరిహాద్దు ప్రాంతాల స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.

గణేష్ 2004 లో అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన చర్చల్లో మావోయిస్టుల ప్రతినిధిగా రామకృష్ణ, సుధాకర్ లతో కలిసి పాల్గొన్నాడు.చర్చల సమయంలో ప్రకాశం జిల్లా అడవుల నుండి మావోయిస్టులు అడవుల నుండి బయటకు వచ్చారు.అయితే చర్చలు ముగిసిన తర్వాత గద్దర్ బృందం వరంగల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులను వదిలి వెళ్ళింది.
మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఎదిగిన రవి మరణించడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.. మావోయిస్టు కీలక నేతగా ఎదిగిన రవి పలు మార్లు ఎన్ కౌంటర్ల నుండి తప్పించుకొన్నారు. అయితే ఈ దఫా మాత్రం పోలీసులు పక్కా సమాచారంతో ఎన్ కౌంటర్ నిర్వహించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications