రూ.500 నోటుపై షాక్, మరిన్ని ఆంక్షలు: ఇక అక్కడ తీసుకోరు
నవంబర్ 10వ తేదీ తర్వాత పాత రూ.500 నోట్లను మెట్రో, రైళ్లు, బస్సులలో తీసుకోరు.
న్యూఢిల్లీ: నవంబర్ 10వ తేదీ తర్వాత పాత రూ.500 నోట్లను మెట్రో, రైళ్లు, బస్సులలో తీసుకోరు. నోట్ల రద్దు అనంతరం ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో పాత రూ.500 నోటును పలు చోట్ల వినియోగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
అందులో పబ్లిక్ రవాణా వ్యవస్థ, రైల్వే టిక్కెట్లు, మెట్రో టిక్కెట్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలలో డిసెంబర్ 15వ తేదీ వరకు పాత రూ.500 నోటును ఉపయోగించవచ్చునని కేంద్రం చెప్పింది. అయితే, ఇప్పుడు దానిని కుదించింది.

బంగారం ధర పతనం కొనసాగుతోంది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 10 గ్రా. స్వచ్ఛమైన బంగారం రూ.130 కోల్పోయి 28,580కు చేరింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో బంగారం ధర పడిపోయిందని బులియన్ వర్గాలు తెలిపాయి. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది.












Click it and Unblock the Notifications